సంగారెడ్డి : కస్తూరిబా పాఠశాలలో  25 మంది విద్యార్థులకు అస్వస్థత

సంగారెడ్డి : కస్తూరిబా పాఠశాలలో  25 మంది విద్యార్థులకు అస్వస్థత

కంగ్టి( నారాయణఖేడ్)  నవంబర్ 5,  మన సాక్షి : సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణంలోని కేజీబీవీ పాఠశాలలో శనివారం ఫుడ్ పాయిజన్ తో 25 మంది బాలికలు అస్వస్థతకు గురయ్యారు. ఉదయం టిఫిన్ లో తిన్న అటుకులలో ఫుడ్ పాయిజన్ కావడం వల్లనే అస్వస్థతకు గురైనట్లు విద్యార్థులు పేర్కొంటున్నారు .

విద్యార్థులను వెంటనే ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు . అయితే ఆసుపత్రిలో వైద్యం చేయించాల్సిన వైద్యులు అందుబాటులో లేకపోవడంతో అక్కడికి చేరుకున్న జడ్పిటిసి లక్ష్మీబాయి రవీందర్ నాయక్ వైద్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆలస్యంగా వచ్చిన డాక్టర్ సంఘవి రవీందర్ నాయక్ తో నువ్వు ఎవరు అని దురుసుగా , నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులకు వెంటనే సరైన చికిత్స నిర్వహించాలని డాక్టర్లను ఆదేశించారు.