బిగ్ బ్రేకింగ్ : కత్తులతో బెదిరించి కిడ్నాప్ కు యత్నం

బిగ్ బ్రేకింగ్ : కత్తులతో బెదిరించి కిడ్నాప్ కు యత్నం

హైదరాబాద్, మనసాక్షి :

రంగారెడ్డి జిల్లా నార్సింగి ప్రాంతంలోని జన్వాడ చౌరస్తాలో ఓ కిడ్నాప్ ముఠా హల్ చల్ చేసింది. ఓ వ్యక్తిని కత్తులతో బెదిరించి కారులోకి ఎక్కించుకునే ప్రయత్నం చేశారు.

 

కాగా స్థానికులు, గ్రామస్తులు చూసి ఆ కిడ్నాప్ ముఠాకు ఎదురు తిరిగారు. వ్యక్తిని కిడ్నాప్ చేయకుండా అడ్డుకున్నారు. అంతేకాకుండా పారిపోతున్న కిడ్నా ప్ ముఠాను వెంబడించి పట్టుకున్నారు.

కిడ్నాప్ ముఠా ను పట్టుకొని చితకబాదారు. వారిని నార్సింగి పోలీసులకు అప్పగించారు. కిడ్నాప్ ముఠాలో ఇద్దరు వ్యక్తులను నార్సింగి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.