బిగ్ బ్రేకింగ్ : మిర్యాలగూడలో వ్యక్తిపై కత్తితో దాడి

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో వ్యక్తిపై కత్తితో దాడి

మిర్యాలగూడ, మనసాక్షి :

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఒక వ్యక్తిపై కత్తితో దాడి చేసిన సంఘటన మంగళవారం రాత్రి చోటుచేసుకుంది.

మిర్యాలగూడ రైల్వే స్టేషన్ సమీపంలో జలంధర్ అనే ఆటో మెకానిక్ పై మరో వ్యక్తితో దాడి చేసినట్లు తెలుస్తుంది.

 

ఈ ఘటనలో జలంధర్ కు మెడపై తీవ్ర గాయం కావడంతో చికిత్స నిమిత్తం ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం .

 

ఫైనాన్స్ చెల్లింపు విషయమై వివాదం …!

ఆటో ఎలక్ర్టిషియన్ గా పనిచేస్తున్న వాంకుడోతు జలంధర్ పై ..అతని స్నేహితుడైన ఇస్లావత్ సంతోష్ కత్తితో గొంతుపై దాడి చేసి తీవ్రంగా గాయపర్చిన సంఘటన మంగళవారం నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని రైల్వే స్టేషన్ సమీపంలో చోటు చేసుకుంది, రూరల్ పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

 

మిర్యాలగూడ మండలం ..దొండవారిగూడెం గ్రామానికి చెందిన వాంకుడోతు జలంధర్..స్థానిక ఎఫ్ సీఐ సమీపంలో ఆటో ఎలక్ర్టిషియన్ షాపు నడిపిస్తున్నాడు. ఈ క్రమంలో త్రిపురారం మండలం ..సత్యంపాడు తండాకు చెందిన ఇస్లావత్ సంతోష్ తో పరిచయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో జలంధర్ మద్య వర్తిగా ఉండి ..సంతోష్ కు ఆటోను ఫైనాన్స్ లో ఇప్పించాడు.

 

అయితే ఫైనాన్స్ సక్రమంగా చెల్లించకపోవడంతో ..ఇదే విషయమై ఇటీవల ఇరువురి మద్య స్వల్ప ఘర్షణ జరిగింది. అయితే ఫైనాన్స్ డబ్బులు చెల్లిస్తానని ..రైల్వే స్టేషన్ సమీపంలోకి జలబంధర్ ను పిలిపించిన సంతోష్ అతనిపై కత్తితో దాడి చేసిండు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన జలంధర్ ను స్థానికులు స్థానిక ప్రైవేట్ ఆస్పత్రికి పంపించారు.

 

పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స నిమిత్తం హైద్రాబాద్ కు తరలించారు. బాధితుడు తల్లి రాజమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ పోలీసులు తెలిపారు.