Kodada : కోదాడ లో పేకాట స్థవరాలపై పోలీస్ ల దాడి.. 9 మంది అరెస్ట్
చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై ఉక్కుపాదం మోపుతామని, నిందితులు ఎంతటివారైనా కఠినచర్యలు తప్పవని జిల్లా ఎస్పీ నరసింహ అన్నారు.

Kodada : కోదాడ లో పేకాట స్థవరాలపై పోలీస్ ల దాడి.. 9 మంది అరెస్ట్
సూర్యాపేట, మనసాక్షి :
చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై ఉక్కుపాదం మోపుతామని, నిందితులు ఎంతటివారైనా కఠినచర్యలు తప్పవని జిల్లా ఎస్పీ నరసింహ అన్నారు. పేకాట స్థవరాల దాడి విషయం ఎస్పీ వివరించారు. 16వ తేది అర్ధరాత్రి సమయంలో నమ్మదగిన సమాచారంపై కోదాడ పట్టణ పోలీసులు, స్పెషల్ బ్రాంచిపోలీసులు సంయుక్తముగా మెళ్లచెరువు మండల పరిది రామాపురం, భూడాడు గ్రామాల సరిహద్దు శివారులో నిర్మానుష్య ప్రాంతంలో పేకాట నిర్వహిస్తున్న, ఆడుతున్న స్థవరాలపైన దాడులు నిర్వహించి 9 మంది పేకాటరాయుళ్లను ఆరెస్ట్ చేశామన్నారు.
ఈ సందర్బంగా వారి నుండి 4 ద్విచక్ర వాహనాలు, 10 సెల్ ఫోన్లు స్వాదీనం చేసుకుని, 9 మంది పేకాట రాయుళ్లని అదుపులోకి తీసుకుని అరెస్టు చేసి వారి నుండి రూ.76,400 నగదును సీజ్ చేయడం జరిగిందన్నారు.
పేకాట వంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన, వ్యవస్థీకృతంగా నిర్వహించిన, సహకరించిన అలాంటి వారిపై గేమింగ్ యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేయడం జరుగుతుందన్నారు.
ప్రజలు ఇటువంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు దూరముగా ఉండాలని, అక్రమ రవాణా అసాంఘిక కార్యకలాపాలపై జిల్లా పోలీస్ శాఖ ఉక్కు పాదం మోపుతుందని, ఇసుక అక్రమ రవాణా, చేసిన ప్రభుత్వ పంపిణీ బియ్యాన్ని అక్రమంగా వ్యాపారం నిర్వహించిన, పశువులను జంతువులను అక్రమంగా రవాణా చేసిన అలాంటి వారిపై పోలీస్ శాఖ కఠిన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు.
MOST READ









