Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
జిల్లా వార్తలుBreaking Newsనల్గొండ

District collector : కలెక్టర్ కీలక ఆదేశం.. బత్తాయి మార్కెట్ ను సిద్ధం చేయాలి..!

రానున్న బత్తాయి సీజన్ కు ఎస్ఎల్బీసీ వద్ద ఉన్న బత్తాయి మార్కెట్ ను సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ ఉద్యాన, మార్కెటింగ్ శాఖలెస్ అధికారులను ఆదేశించారు.

District collector : కలెక్టర్ కీలక ఆదేశం.. బత్తాయి మార్కెట్ ను సిద్ధం చేయాలి..!

నల్లగొండ, మన సాక్షి

రానున్న బత్తాయి సీజన్ కు ఎస్ఎల్బీసీ వద్ద ఉన్న బత్తాయి మార్కెట్ ను సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ ఉద్యాన, మార్కెటింగ్ శాఖలెస్ అధికారులను ఆదేశించారు. మంగళవారం అయన తన చాంబర్ లో బత్తాయి మార్కెట్ పై ఉద్యాన, మార్కెటింగ్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో బత్తాయి పంట, బత్తాయి వెరైటీలు, ఉత్పత్తి, విస్తీర్ణం, దిగుబడులు, బత్తాయి సాగు చేస్తున్న రైతులు, బత్తాయి కొనుగోలు చేస్తున్న ట్రేడర్లు, తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు.

ఇటీవల కొండమల్లేపల్లిలో నిర్వహించిన బత్తాయి రైతుల సమావేశంలో బత్తాయి రైతులు తీసుకువచ్చిన పలు విషవలను దృష్టిలో ఉంచుకొని జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో ఉన్న బత్తాయి మార్కెట్ రైతులకు అందుబాటులో లేనందున ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వ్యాపారస్తులు బత్తాయి రైతులను మోసం చేస్తున్నారని, బత్తాయి రైతులు సైతం మార్కెట్ సౌకర్యం కల్పించాలని సమావేశంలో గుర్తు చేసిన విషయాన్ని ప్రస్తావించారు.

ఏప్రిల్ ఒకటి నుండి బత్తాయి రైతులందరికీ లైసెన్స్ తీసుకునేలా ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి అవగాహన కల్పించాలని చెప్పారు. వచ్చే సీజన్లో బత్తాయిని ఇక్కడే కొనుగోలు చేసేందుకు బత్తాయి మార్కెట్ ను సిద్ధం చేయాలని చెప్పారు. అలాగే బత్తాయిని కొనుగోలు చేసేందుకు ప్రస్తుతం ఉన్న రైతు ఉత్పత్తి సంస్థ చురుకుగా పాల్గొనేలాచేయాలన్నారు.బత్తాయి మార్కెట్ అనుసంధానం తో పాటు, అవసరమైన సౌకర్యాలను కల్పించాలని, బత్తాయి కొనుగోలుకు అవసరమయ్యే పరికరాలన్నింటిని ముందే సిద్ధం చేసి ఉంచాలని అధికారులను ఆదేశించారు.

రైతులు ట్రేడింగ్ లైసెన్స్ ఉన్నవారికే బత్తాయి అమ్మే విధంగా అవగాహన కల్పించాలని చెప్పారు . అలాగే మేలు రకం బత్తాయిని సాగు చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా ఉద్యాన శాఖ అధికారి సుభాషిణి, మార్కెటింగ్ శాఖ ఏడి ఛాయాదేవి, ట్రేడర్ అబిద్ అలీ, ఎఫ్ పిఓ వంశీకృష్ణ తదితరులు హాజరయ్యారు.

MOST READ

మరిన్ని వార్తలు