KTR : నల్గొండలో కేటీఆర్ రైతు మహాధర్నా మరోసారి వాయిదా.. ఎందుకంటే..!
KTR : నల్గొండలో కేటీఆర్ రైతు మహాధర్నా మరోసారి వాయిదా.. ఎందుకంటే..!
మన సాక్షి, నల్గొండ :
నల్గొండ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించే రైతు మహాధర్నా మరోసారి వాయిదా పడింది. ఇప్పటికే మహాధర్నా రెండు పర్యాయాలు వాయిదా పడింది. నల్గొండలో నిర్వహించే మహా ధర్నాకు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ హాజరు కానున్నారు. అందుకు మహాధర్నాకు జిల్లా వ్యాప్తంగా పార్టీ శ్రేణులు రైతులను తరలించేందుకు సమీకరణ సమావేశాలు కూడా నిర్వహించారు.
జనవరి 12వ తేదీన మహా ధర్నా నిర్వహించాలని తలపెట్టిన బీఆర్ఎస్ నేతలు సంక్రాంతి పర్వదినం సందర్భంగా రాకపోకలకు అంతరాయం కలుగుతుందనే ఉద్దేశంతో మొదటిసారి వాయిదా వేశారు. అదేవిధంగా ఈనెల 21వ తేదీన నల్లగొండలోని క్లాక్ టవర్ సెంటర్లో నిర్వహించేందుకు మరోసారి ఆ పార్టీ పిలుపునిచ్చింది. కానీ బీఆర్ఎస్ నిర్వహించే మహా ధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించారు.
దాంతో ఆ పార్టీ అధిష్టానం మహా ధర్నా అనుమతి కోసం హైకోర్టును ఆశ్రయించారు. కాగా హైకోర్టు విచారణ ఈనెల 27వ తేదీ వరకు వాయిదా వేసింది. కోర్టు నిర్ణయం వెలువడే వరకు మరోసారి రైతు మహాధర్నాను వాయిదా వేశారు. కోర్టు నిర్ణయం అనంతరం మహాధర్నా తేదీని మరోసారి ప్రకటించే అవకాశాలు ఉన్నాయి.
MOST READ :
-
TG News : వారికే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా.. జాబితా రెడీ.. లేటెస్ట్ అప్డేట్..!
-
Banana : ఒక్క అరటిపండు రూ.100.. ఎక్కడో తెలిస్తే మీరు షాక్ కావాల్సిందే..!
-
Nalgonda : కేటీఆర్ రైతు మహాధర్నాకు పోలీసుల అనుమతి నిరాకరణ..!
-
Viral Video : స్కూల్లో ఉన్నామనే మర్చారు.. ప్రధానోపాధ్యాయుడి గదిలోనే.. (వీడియో వైరల్)
-
Phone Pe : బిగ్ అలర్ట్.. నకిలీ ఫోన్ పే యాప్స్.. తెలుసుకోకుంటే ఎకౌంట్ ఖాళీ..!









