Breaking Newsక్రైంతెలంగాణరాజకీయంహైదరాబాద్

BIG BREAKING : పట్నం నరేందర్ రెడ్డి రిమాండ్ రిపోర్టులో కేటీఆర్ పేరు..!

BIG BREAKING : పట్నం నరేందర్ రెడ్డి రిమాండ్ రిపోర్టులో కేటీఆర్ పేరు..!

మన సాక్షి, హైదరాబాద్:

వికారాబాద్ జిల్లా లగచర్ల ఘటనలో పోలీసులు అరెస్టు చేసిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి రిమాండ్ రిపోర్టులో కేటీఆర్ పేరు ప్రస్తావించినట్లు సమాచారం. లగచర్ల ఘటన కుట్ర కోణం ఉందని పోలీసులు తేల్చారు.

బుధవారం ఉదయం హైదరాబాదులోని కేబీఆర్ పార్కులో పోలీసులు నరేందర్ రెడ్డిని అరెస్టు చేశారు. సాయంత్రం ఆయనను కొడంగల్ కోర్టులో హాజరు పరిచారు. కాగా కొడంగల్ కోర్టు ఆయనకు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది.

కాగా పట్నం నరేందర్ రెడ్డిని చర్లపల్లి జైలుకు తరలించారు. కాగా పట్నం నరేందర్ రెడ్డి రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు వెలుగు చూశాయి. లగచర్లలో కుట్రపూరితంగానే వ్యవహరించారని అంశాన్ని పోలీసులు గుర్తించారు.

ప్రధాన నిందితుడు సురేష్ తో పలు పర్యాయాలు నరేందర్ రెడ్డి మాట్లాడినట్లు విచారణలో తేలిందని పోలీసులు పేర్కొంటున్నారు. అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి కూడా మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో ఫోన్లో మాట్లాడినట్లు సమాచారం. దాంతో నరేందర్ రెడ్డి రిమాండ్ రిపోర్టులో కేటీఆర్ పేరు ప్రస్తావించినట్లు తెలిసింది.

MOST READ : 

మరిన్ని వార్తలు