బిగ్ బ్రేకింగ్ : కూడవెల్లి వాగులో పడి ఇద్దరు యువకులు మృతి

బిగ్ బ్రేకింగ్ : కూడవెల్లి వాగులో పడి ఇద్దరు యువకులు మృతి

దుబ్బాక, మనసాక్షి :

కూడవెల్లి వాగులో పడి ఇద్దరు యువకులు మృతి చెందిన సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. ఇలా ఉన్నాయి. దుబ్బాక మున్సిపల్ పరిధిలోని చెర్వా పురుగు చెందిన పిట్టల వాడకు చెందిన మల్లేశం (17), విష్ణు (17)లు కూడవెల్లి వాగులో స్నానానికి వెళ్లిన ఇద్దరు యువకులు ప్రమాధావశాత్తు వాగులో పడి మృతి చెందిన సంఘటన మిరుదొడ్డి మండలం లింగుపల్లి పరిధిలో జరిగింది.

 

గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం దుబ్బాక మండలం చేర్వాపూర్ పిట్టల వాడకు చెందిన మల్లేశం (17), విష్ణు (17) అనే ఇద్దరు యువకులు మిరుదొడ్డి మండలం మల్లుపల్లి, లింగుపల్లి గ్రామాల్లో మామిడి కాయలు తెంపడానికి వెళ్లారు. అయితే ఎండ తీవ్రత తట్టుకోలేక లింగుపల్లి పరిధిలోని కూడవెల్లి వాగులో స్నానానికి వెళ్లి ప్రమాధావశాత్తు గల్లంతు అయ్యారు.

 

స్థానికులు గమనించి వెంటనే పోలీసులకు, కుటుంబీకులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న కుటుంబీకులు బోరున విలపించారు. మిరుదొడ్డి పోలీసుల ఆధ్వర్యంలో మృతదేహాలను పోలీసులు లింగుపల్లి గ్రామానికి చెందిన గజ ఈత గల మహేష్ ,నాగరాజు, కిషన్ సాయం మృతదేహాలను వెలికి తీశారు. పోలీసులు, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.