తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునారాయణపేట జిల్లా

District collector : భూసేకరణ పునరావాస, ఉపాధి పనులు వేగవంతం చేయాలి..!

District collector : భూసేకరణ పునరావాస, ఉపాధి పనులు వేగవంతం చేయాలి..!

నారాయణపేట : జిల్లా కలెక్టరేట్ లోని వీసీ హాల్ లో సోమవారం సాయంత్రం భూ సేకరణ పునరావాస పునరుపాది కల్పన పై జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ సమక్షంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. నారాయణపేట -కొడంగల్ ఎత్తిపోతల పథకానికి సంబంధించి రెవెన్యూ అధికారులు ఇటీవలే నిర్వహించిన గ్రామ సభలు, భూసేకరణ సర్వే పై వచ్చిన నోటిఫికేషన్ల పై చర్చించారు.

సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వర్ మాట్లాడుతూ.. భూసేకరణలో పునరావాసం మరియు పునరుపాది (ఆర్ & ఆర్) అనేది భూసేకరణ ప్రాజెక్టుల ద్వారా నిర్వాసితులైన వ్యక్తులు లేదా కుటుంబాలకు మద్దతు అందించే ప్రక్రియను సూచిస్తుందని తెలిపారు.

ఇందులో న్యాయమైన పరిహారాన్ని నిర్ధారించడం వారి పునరావాసం కోసం తగిన సౌకర్యాలను అందించడం, తరచుగా సేకరణ తర్వాత వారి సామాజిక-ఆర్థిక స్థితిని మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకోవడం వంటివి ఉంటాయన్నారు. భూ సేకరణ చేసినప్పుడు పట్టాదారులు తమ భూములు కోల్పోతే ప్రభుత్వ పరంగా నష్టపరిహారం చెల్లించడం జరుగుతుందన్నారు.

కానీ భూ సేకరణలో మొత్తం భూమితో పాటు జీవనోపాధిని కోల్పోయిన వారికి ఆర్ అండ్ అర్ చట్టం వర్తిస్తుందని తెలిపారు. వచ్చిన 13 నోటిఫికేషన్ల లో 12 మంది కి ఆర్ అండ్ అర్ చట్టం వర్తిస్తుందని అదనపు కలెక్టర్ పునరావాస పునరుపాది కమిటీ సభ్యులకు తెలిపారు.

ఈ సమావేశంలో ఆర్డీఓ రామచంద్రనాయక్, సెక్షన్ అధికారి శ్రీధర్ సభ్యులు సతీష్ కుమార్, పడాకుల శ్రీనివాసులు, నారాయణపేట, మక్తల్, ఉట్కూర్, తహాసిల్దారులు పాల్గొన్నారు.

MOST READ : 

  1. Rythu Bharosa : రైతు భరోసా ఇక వారికేనా.. ఇంకెత కాలం.. లేటెస్ట్ అప్డేట్..!

  2. TG News : తెలంగాణలో కొత్త మంత్రులకు శాఖలు ఇవే..!

  3. Rythu Bharosa : రైతు భరోసా ఆ లోపే.. మంత్రి తుమ్మల క్లారిటీ..!

  4. Rythu Bharosa : రైతు భరోసా పై కీలక అప్డేట్.. మంత్రివర్గంలో ఏం చర్చించారు.. తుమ్మల క్లారిటీ..!

  5. Gold Price : ఒక్కసారిగా భారీగా తగ్గిన బంగారం ధర.. ఈరోజు ధర ఎంతంటే..!

మరిన్ని వార్తలు