తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునల్గొండ

Miryalaguda : భూభారతిలో ప్రతి ఏటా డిసెంబర్ 31న భూముల వివరాల ప్రదర్శన.. జిల్లా కలెక్టర్ వెల్లడి..!

Miryalaguda : భూభారతిలో ప్రతి ఏటా డిసెంబర్ 31న భూముల వివరాల ప్రదర్శన.. జిల్లా కలెక్టర్ వెల్లడి..!

మిర్యాలగూడ, మన సాక్షి:

ధరణిలో లేని అనేక వెసులుబాట్లు భూ భారతిలో ఉన్నాయని, భూముల వివరాలన్నింటినీ భూ భారతి లో ఆన్‌లైన్ లో ఉంచే వ్యవస్థ ఉందని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. భూభారతి చట్టం( భూమి హక్కుల చట్టం -2025) పై రైతులకు అవగాహన కల్పించేందుకు ఉద్దేశించి నిర్వహిస్తున్న అవగాహన సదస్సులలో భాగంగా శుక్రవారం నల్గొండ జిల్లా, మిర్యాలగూడ మండల కేంద్రంలో భూ భారతిపై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు  ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

వై వాటా వివాదాలలో భాగంగా చుట్టూ పక్కల ఉన్న భూములన్నింటిని సర్వే చేసే అవకాశం భూ భారతిలో ఉందని ,అలాగే సంవత్సరంలో రికార్డులను సవరణ చేసే అవకాశం సైతం భూ భారతి కల్పిస్తుందని, ధరణిలో అప్పీల్ వ్యవస్థకు అవకాశం లేకుండెదని, అంతేకాక అనుభవ దారుకి ప్రాధాన్యత లేదని, భూభారతిలో కిందిస్థాయిలో న్యాయం జరగకపోతే పై స్థాయిలో అప్పీలు చేసుకోవచ్చని ,అంతేకాక భూ భారతి చట్టంలో అనుభవదారుకు ప్రాధాన్యత ఉంటుందని ఆమె వెల్లడించారు.

రిజిస్ట్రేషన్ ,మ్యుటేషన్ తదితర వాటికి భూ భారతి చట్టంలో రైతు ఎలాంటి ఫీజులు చెల్లించాల్సిన అవసరం లేదని తెలిపారు. భూమి కొనుగోలు చేసిన 30 రోజులలో మ్యుటిషన్ కాకపోతే 31వ రోజు ఆటోమేటిక్ గా మ్యుటేషన్ అవుతుందన్నారు. రికార్డులను సరి చేసె అధికారంఆర్డీవో కు ఉందని తెలిపారు.

ప్రతి సంవత్సరం డిసెంబర్ 31న రెవెన్యూ గ్రామ పరిధిలో భూముల వివరాలన్నింటినీ రైతులందరికీ కనిపించే విధంగా ప్రదర్శించడం జరుగుతుందని, వీటి ద్వారా ఏవైనా సవరణలకు దరఖాస్తు చేసుకోవచ్చని ఆమె తెలిపారు.

మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డిమాట్లాడుతూ  సాగులో ఉన్న ప్రతి రైతుకు భూమిపై హక్కు కల్పించాలన్న ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం భూ భారతి చట్టాన్ని తీసుకువచ్చిందని అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం ధరణిలో ఉన్న భూ సమస్యలన్నింటిని గమనించి ధరణిని పక్కనపెట్టి ధరణి స్తానంలో కొత్త చట్టాన్ని తీసుకురావాలని భూ భారతి చట్టాన్ని తీసుకువచ్చిందని, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి రోజున చారిత్రాత్మక భూ భారతి చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినట్లు తెలిపారు. దీంతో తమ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం అని నిరూపించుకుంది అని అన్నారు.

ధరణిలో అనేక లోటు పాట్లు ఉన్న దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం కొత్త చట్టం తీసుకురావాలన్న ఉద్దేశంతో పలువురు మేధావులు, రైతులు, రైతు సంఘాలు అందరితో చర్చించి ముందుగా కొన్ని మండలాలను పైలట్ మండలాలుగా తీసుకున్నదని, అందులో నల్గొండ జిల్లాలోని తిరుమలగిరి సాగర్, అడవిదేవులపల్లి కూడా ఉండేవని ,అయితే అనంతరం తిరుమలగిరి సాగర్ మండలంలో అన్ని రకాల భూ సమస్యలు ఉన్నందున ఆ మండలాన్ని పైలెట్ మండలం గా తీసుకున్నట్లు తెలిపారు.

సాగులో ఉన్న రైతుకి, కబ్జాలో ఉన్న వారికి పట్టా ఇవ్వాలన్న ఉద్దేశంతోనే భూ భారతి చట్టాన్ని తీసుకురావడం జరిగిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమం కోసం ఇచ్చిన హామీల మేరకు అన్నింటిని నెరవేరుస్తున్నదని, ముఖ్యంగా ఇల్లులేని నిరుపేదలకు ఇంటి పట్టాలనివ్వడం, ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇచ్చే కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు.

శాసనమండలి సభ్యులు శంకర్ నాయక్ మాట్లాడుతూ ధరణి స్థానంలో తీసుకువచ్చిన భూ భారతి చట్టం రైతులకు అన్ని రకాల మేలు కలిగిస్తుందని, దీనిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్, మిర్యాలగూడ తహసిల్దారు హర, భూ భారతి చట్టంపై అవగాహన కల్పించారు.

MOST READ :

  1. Nalgonda : జిల్లా జైలును సందర్శించి ఖైదీలతో మాట్లాడిన మానవ హక్కుల కమిషన్ చైర్మన్..!

  2. Google Search : గూగుల్లో సెర్చ్ చేశాడు.. స్కామర్లకు చిక్కాడు..!

  3. Miryalaguda : ఓపెన్ టెన్త్ పరీక్షల్లో ఒకరికి బదులు మరొకరు పరీక్ష.. పోలీసులకు ఫిర్యాదు..!

  4. అఘోరి ఆడా.. మగా.. తేల్చి చెప్పిన వైద్యులు.. చంచల్ గూడ జైలుకు తరలింపు..!

  5. Rythu Bharosa : రైతు భరోసా అందని రైతులకు స్పష్టత.. లేటెస్ట్ అప్డేట్..!

మరిన్ని వార్తలు