TOP STORIESBreaking Newsసంక్షేమం

Indiramma Houses : ఇందిరమ్మ ఇళ్లపై లేటెస్ట్ అప్డేట్.. అదిరిపోయే శుభవార్త..!

Indiramma Houses : ఇందిరమ్మ ఇళ్లపై లేటెస్ట్ అప్డేట్.. అదిరిపోయే శుభవార్త..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త తెలియజేసింది. డిసెంబర్ మొదటి వారంలో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించనున్నది. అందులో మొదటి విడతగా నిరుపేదలకు ఈ పథకాన్ని వర్తింపజేయనున్నారు. కాగా వారికి మాత్రం అదిరిపోయే శుభవార్త తెలియజేసింది.

ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్ధిదారులకు అదనపు గదులను ఏర్పాటు చేసుకునే అవకాశం కూడా కల్పించింది. ప్రభుత్వం నుంచి ఎలాంటి అభ్యంతరం లేదని లబ్ధిదారులు అదనపు గదులను కూడా ఏర్పాటు చేసుకోవచ్చని తెలిపింది. దాంతో లబ్ధిదారుల్లో ఆనందం కలగనున్నది.

మొదటి విడతలో సొంత స్థలం ఉన్న, ఇల్లు కట్టుకునే వారికి అవకాశం కల్పించనున్నారు. వారికి ప్రభుత్వం ఐదు లక్షల రూపాయలను విడుదల చేయనున్నది. 2024 -25 సంవత్సరంలో తెలంగాణలో 4.50 లక్షల ఇళ్లను మంజూరు చేయనున్నారు.

మొదటగా నిరుపేదలకు ఇండ్లను మంజూరు చేయనున్న ప్రభుత్వం ఆ తర్వాత దివ్యాంగులు, వ్యవసాయ కూలీలు, సాగుభూమి లేని వారు, పారిశుద్ధ్య కార్మికులు కు మంజూరు చేయనున్నారు.

కేంద్రంపై ఆధారం :

కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకాన్ని అమలు చేస్తుంది. కాగా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని కూడా ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకానికి లింకప్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దాంతో రాష్ట్ర ప్రభుత్వంపై భారం తగ్గనున్నది. అందుకోసం ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభించడానికి కొంత ఆలస్యం అవుతుందని చెప్పవచ్చును.

యాప్ ద్వారా పైలెట్ ప్రాజెక్టు : 

రాష్ట్రంలో ఇందిరమ్మ ఇల్లు పథకాన్ని ప్రారంభించడానికి పైలెట్ ప్రాజెక్టును నిర్వహిస్తున్నారు. మహబూబ్‌నగర్ మెదక్ జిల్లాలలో ఒక గ్రామీణ ప్రాంతం, ఒక మున్సిపాలిటీలో పైలెట్ ప్రాజెక్టుగా దీనిని పరిశీలిస్తున్నారు. పథకం సక్రమంగా అమలయేలా ఒక యాప్ రూపొందించారు.

వివరాలన్నింటిని నమోదు చేస్తున్నారు. సాంకేతిక సమస్యలు ఏమైనా వస్తున్నాయా.. అనే విషయాన్ని గమనిస్తున్నారు. ఆయా జిల్లాల్లో నిర్వహించే పైలట్ ప్రాజెక్టు విజయవంతం కాగానే రాష్ట్రవ్యాప్తంగా అదే విధంగా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించనున్నారు.

MOST READ : 

మరిన్ని వార్తలు