TOP STORIESBreaking Newsవ్యవసాయం

Rythu Bharosa : రైతు భరోసా పై లేటెస్ట్ అప్డేట్.. ఉన్నట్టా..? లేనట్టా..!

Rythu Bharosa : రైతు భరోసా పై లేటెస్ట్ అప్డేట్.. ఉన్నట్టా..? లేనట్టా..!

మన సాక్షి, వెబ్ డెస్క్:

తెలంగాణ వ్యాప్తంగా రైతులు రైతు భరోసా కోసం ఎదురుచూస్తున్నారు. వానకాలం సీజన్ గడిచింది. యాసంగి సీజన్ వచ్చింది. అయినా కూడా ప్రభుత్వం రైతు భరోసా పై క్లారిటీ ఇవ్వలేదు. దాంతో రైతులు అయోమయంలో ఉన్నారు. ఎన్నికల సమయంలో రైతు భరోసా పథకం అమలు చేసి ఎకరానికి 15000 రూపాయల పెట్టుబడి సహాయం అందజేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.

ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడిచింది. కానీ రైతు భరోసా పథకం అమలు చేయలేదు. గత యాసంగి సీజన్ లో గత ప్రభుత్వం మాదిరిగానే రైతుబంధు పథకాన్ని అమలు చేశారు. కానీ కొత్తగా రైతు భరోసా పథకం అమలు చేయలేదు.

రైతు బంధు పథకంలో అనేక లోపాలు ఉన్నాయని అవకతవకలు జరిగాయని ప్రభుత్వం సబ్ కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అంతే కాకుండా రైతు భరోసా విధివిధానాల ఖరారు పై రైతుల అభిప్రాయ సేకరణ కూడా చేశారు. సాగు చేస్తున్న భూములకు మాత్రమే రైతు భరోసా ఇవ్వాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది.

ఎకరానికి 15 వేల రూపాయల చొప్పున రెండు సీజన్లకు రెండు దఫాలుగా పంట సహాయం అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ప్రభుత్వ ఉద్యోగులు, ఐటి చెల్లించే రైతులు కూడా రైతు భరోసా కు అనర్హలుగా నిర్ణయించినట్లు సమాచారం. అదేవిధంగా ఐదు ఎకరాల వరకు ఉన్న రైతులకు మాత్రమే పంట సహాయం అందించాలని కూడా నిర్ణయించినట్లు తెలిసింది.

మహబూబ్‌నగర్ లో శనివారం నిర్వహించిన రైతు పండగ వేదికపై రైతు భరోసాపై సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ ఇస్తారని ఎదురు చూశారు. రైతులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసినప్పటికీ రైతు భరోసా పై సీఎం క్లారిటీ ఇవ్వలేదు. అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా రైతు భరోసా గురించి మాట్లాడలేదు.

ఇటీవల వ్యవసాయ శాఖ మంత్రి మాట్లాడుతూ రైతు బంధు కంటే బోనస్ బాగుందని రైతులు చెబుతున్నట్లు పేర్కొన్న విషయం తెలిసిందే. కాగా బోనస్ వల్ల రైతులు, కౌలు రైతులు కూడా మేలు జరుగుతుందని ప్రభుత్వం భావిస్తుంది. కాగా రైతు భరోసా పై ఇప్పటివరకు ప్రభుత్వం క్లారిటీ ఇవ్వలేదు. దాంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

రైతు భరోసా పథకాన్ని ప్రారంభిస్తారా..? లేదా..? అనే విషయం కూడా క్లారిటీ లేకుండా పోయింది. ఏది ఏమైనా సంక్రాంతి పండుగ సందర్భంగా రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తామని మంత్రులు పేర్కొనడంతో అప్పటివరకు రైతులు వేచి చూడాల్సిందే.

MOST READ : 

మరిన్ని వార్తలు