ఉద్యోగానికి సెలవు.. ప్రైవేట్ ప్రాక్టీస్ లో డాక్టర్.. సస్పెండ్ చేసిన జిల్లా కలెక్టర్..!
ఉద్యోగానికి సెలవు.. ప్రైవేట్ ప్రాక్టీస్ లో డాక్టర్.. సస్పెండ్ చేసిన జిల్లా కలెక్టర్..!
పెద్దపల్లి, ధర్మారం, మనసాక్షి ప్రతినిధి :
ముందస్తు అనుమతి లేకుండా ఓ వైద్యుడు ప్రభుత్వ ఉద్యోగానికి సెలవు పెట్టాడు. 8 నెలలుగా సెలవుల్లో ఉంటూ ప్రైవేట్ వైద్యశాలలో ప్రాక్టీస్ చేస్తున్నాడు. విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ సస్పెండ్ చేశారు.
డ్యూటీ సమయంలో ప్రైవేట్ ప్రాక్టీస్ చేసే ప్రభుత్వ వైద్యుల పట్ల కఠినంగా వ్యవహరిస్తామని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని మాతా శిశు సంరక్షణ కేంద్రంలో డిప్యూటీ సివిల్ సర్జన్ గైనకాలజి స్పెషలిస్ట్ గా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ అయేషా ఉస్మాన్ గత 8 నెలల నుంచి విధులకు సరిగ్గా హాజరు కావడం లేదు.
ముందస్తు అనుమతి లేకుండా సెలవులు వినియోగించుకోవడం గమనించామని, గత 8 నెలలో ఆ డాక్టర్ ఒక రోజు కూడా రెసిడెంట్ డాక్టర్ గా 24 గంటల డ్యూటీ నిర్వహించలేదని తెలిపారు.
ఎమర్జెన్సీ సేవలలో విధులు నిర్వహించే వైద్యురాలు విధుల పట్ల చూపుతున్న నిర్లక్ష్యాన్ని పరిగణలోకి తీసుకుంటూ డిప్యూటీ సివల్ సర్జిన్ ను సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ గైనకాలజిస్టులు వారికి కేటాయించిన డ్యూటీ సమయంలో ఆస్పత్రులలో పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండాలన్నారు..
ప్రభుత్వ ఆసుపత్రులలో డ్యూటీ సమయంలో ప్రైవేట్ ప్రాక్టీస్ నిర్వహించే వైద్యుల పట్ల చాలా కఠినంగా వ్యవహరిస్తామని జిల్లా కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
LATEST UPDATE :
Runamafi : రూ. 2 లక్షలకు పైగా రుణం ఉందా.. రుణమాఫీ కాని రైతులకు గుడ్ న్యూస్..!
Srisailam : శ్రీశైలం కు మళ్లీ భారీ వరద.. 10 గేట్ల ఎత్తివేత..!
మిర్యాలగూడ : ప్రైవేట్ ఆస్పత్రుల్లో సీఎంఆర్ఎఫ్ స్కాం.. అరెస్టుకు సిద్ధమైన సిఐడి..!









