Cird : వేసవిలో పెరుగు పుల్లగా అవుతుందా.. తీయగా, గడ్డలా ఉండేలా ఇంట్లోనే చేసుకునేది ఎలాగో తెలుసుకుందాం..!
Cird : వేసవిలో పెరుగు పుల్లగా అవుతుందా.. తీయగా, గడ్డలా ఉండేలా ఇంట్లోనే చేసుకునేది ఎలాగో తెలుసుకుందాం..!
మన సాక్షి , వెబ్ డెస్క్:
పెరుగు తినడం ఆరోగ్యానికి మంచిది. వేసవిలో పెరుగు తినే వాళ్లకు శరీరం చల్లగా అవుతుందని భావిస్తారు. ప్రతిరోజు భోజనంలో పెరుగును తింటుంటారు. అలాంటిది వేసవికాలంలో ఎండలకు పెరుగు పుల్లగా అవుతుంది. పుల్లటి పెరుగు తినడం వల్ల రుచి ఉండకపోవడంతో పాటు ఆరోగ్యానికి కూడా హానికరం.
పుల్లటి పెరుగు వల్ల గ్యాస్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా గడ్డలా ఉండే తీయటి పెరుగు కావాలని కోరుకుంటారు. అలాంటిది పెరుగును మన ఇంట్లోనే తియ్యగా, గడ్డలా.. ఉండేలా తయారు చేసుకోవచ్చును. అది ఎలాగో చూద్దాం…
సింపుల్ గా ఇలా చేస్తే సరిపోతుంది :
ముందుగా పాలను బాగా వేడి చేసి ఉంచాలి. గోరువెచ్చగా ఉన్న సమయంలో పెరుగు గా మార్చాలనుకున్న పాలలో ఒక పచ్చిమిర్చిని వేసి తోడు కు కొంచెం ఒక స్పూన్ చల్ల వేసి ఉంచాలి. అలాగే సుమారు నాలుగు గంటల పాటు ఉంచిన అనంతరం పాలు పెరుగుగా గడ్డగా మారుతాయి.
పెరుగుగా మారిన తర్వాత చల్లగా ఉండాలని కోరుకుంటే ఫ్రిజ్ లో పెట్టుకోవచ్చును. మనం తినేటప్పుడు ఆ పెరుగు తీయగా ఉంటుంది. ఈ చిట్కా పాటిస్తే ప్రతిరోజు తీయటి పెరుగు గడ్డలా ఉండేది తినవచ్చును.
ALSO READ :
Cm Revanth : రైతులకు సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త.. 9వ తేదీ వరకు వారి ఎకౌంట్లకు డబ్బులు..!
WhatsApp : వాట్సాప్ లో అదిరిపోయే ఫీచర్.. ఈవెంట్ ప్లాన్ చేయొచ్చు..!
Theenmar Mallanna : నామినేషన్ రోజే తీన్మార్ మల్లన్న సంచలన ప్రకటన.. రాజకీయాల్లో ప్రకంపనలు..!










