Theenmar Mallanna : నామినేషన్ రోజే తీన్మార్ మల్లన్న సంచలన ప్రకటన.. రాజకీయాల్లో ప్రకంపనలు..!

నల్గొండ , ఖమ్మం , వరంగల్ నియోజకవర్గ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు.

Theenmar Mallanna : నామినేషన్ రోజే తీన్మార్ మల్లన్న సంచలన ప్రకటన.. రాజకీయాల్లో ప్రకంపనలు..!

నల్గొండ ,మన సాక్షి :

నల్గొండ , ఖమ్మం , వరంగల్ నియోజకవర్గ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ కార్యక్రమానికి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తో పాటు పలువురు ఎమ్మెల్యేలు హాజరయ్యారు.

భారీ ర్యాలీతో ఆయన నల్లగొండ కలెక్టరేట్ లో నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న ఓ సంచలన ప్రకటన చేశారు. ఆయన చేసిన ప్రకటన రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు తెస్తుంది. రాజకీయాల్లోకి వచ్చి ఆస్తులు డబ్బులు కూడ పెట్టుకోవాలని ఎంతోమంది భావిస్తుంటారు. వేలకోట్ల రూపాయలను సంపాదించి అవినీతి ఊబిలో ఊరుకుపోయిన రాజకీయ నాయకులు సైతం ఎంతోమంది ఉన్నారు.

ఇదిలా ఉండగా ఆయన రాజకీయాల్లో పెను మార్పులు తీసుకురావాలని ఆలోచన ఉన్నట్లు పేర్కొన్నారు. రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు అనేకమంది తమ సొంత ఆస్తులను సైతం ప్రజలకు పంచిపెట్టిన వారు ఉన్నారు. అలాంటివారు ప్రజల గుండెల్లో నిలిచారు. వారిని ఆదర్శంగా తీసుకున్న తీన్మార్ మల్లన్న సంచలన ప్రకటన చేశారు.

తనకు తన కుటుంబ సభ్యుల పేరు మీద ఉన్న 1. 50 కోట్ల రూపాయల ఆస్తులను పూర్తిగా ప్రభుత్వానికి అప్పగిస్తున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వ సిఎస్ ఎప్పుడు అంటే అప్పుడు ప్రభుత్వం పేరు మీద తన ఆస్తులు మార్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. కాగా తీన్మార్ మల్లన్న తన ఆస్తులను ప్రభుత్వానికి అప్పగిస్తున్నట్లు చేసిన ప్రకటన రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తుంది.

తనను ఎమ్మెల్సీగా గెలిపిస్తే రాజకీయాల్లో మార్పులు తీసుకువచ్చేందుకు ప్రయత్నం చేస్తానని తీన్మార్ మల్లన్న పేర్కొన్నారు. రాజకీయాల్లోకి వచ్చాక ఆస్తులను ప్రజలకు పంచిన నాయకులు ఉన్నారు. ఆస్తులు కూడా పెట్టుకున్న నాయకులు ఉన్నారు. కానీ నామినేషన్ రోజే ఆస్తులను ప్రభుత్వానికి అప్పగించే నాయకులు ఇప్పటివరకు ఎవరూ లేరు. దాంతో తీన్మార్ మల్లన్న ప్రకటన సంచలనం కలిగిస్తుంది

 

ALSO READ : 

Climbing Stairs : మీరు ప్రతిరోజు మెట్లు ఎక్కి దిగుతున్నారా..? అయితే ఇది తెలుసుకోవాల్సిందే.. కొత్త అధ్యాయంలో నిజాలు..!

BREAKING : తక్కువ మార్కులు వచ్చాయని కత్తులతో పొడుచుకున్న తల్లి కూతుర్లు..!

Telangana : తెలంగాణ మహిళలకు సర్కార్ శుభవార్త.. ఏకంగా లక్ష రూపాయలు..!

Telangana : నేను పిలిస్తే 25 మంది ఎమ్మెల్యేలు రావడానికి సిద్ధం.. భువనగిరి, నల్గొండ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులు సర్పంచులుగా కూడా పనికిరారు..!