TOP STORIESBreaking Newsజాతీయం

Srisailam : శ్రీశైలం నీటి కోసం రెండు తెలుగు రాష్ట్రాల లేఖలు..!

Srisailam : శ్రీశైలం నీటి కోసం రెండు తెలుగు రాష్ట్రాల లేఖలు..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

శ్రీశైలం జలాశయం నీటి కోసం రెండు తెలుగు రాష్ట్రాలు కృష్ణ రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ (KRMB) కి లేఖలు రాశాయి. శ్రీశైలం ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో నీటి అవసరాల దృష్ట్యా రెండు తెలుగు రాష్ట్రాలు లేఖలు రాశాయి.

రాయలసీమలో తాగునీటి అవసరాల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా నీటిని విడుదల చేయాలని లేఖ రాసింది. తాగునీటి అవసరాలకు 12 టీఎంసీల నీటిని విడుదల చేయాలని లేఖలో పేర్కొన్నది. కాగా తెలంగాణ ప్రభుత్వం శ్రీశైలం ఎడమ గట్టు నుంచి విద్యుత్ ఉత్పత్తి చేయాలని లేఖ రాసింది.

శ్రీశైలం జలాశయ పూర్తిస్థాయి నీటిమట్టం సామర్థ్యం 885 అడుగులకు గాను ప్రస్తుతం 861 అడుగులకు చేరింది.

ఇవి కూడా చదవండి :

Telangana : ఉద్యోగుల ఖాతాల్లోకి నగదు.. శుభవార్త తెలియజేసిన తెలంగాణ ప్రభుత్వం..!

ప్లాస్టిక్ రహిత నియోజకవర్గం కావాలి.. ఆ తేదీ తర్వాత విక్రయిస్తే చర్యలు, డెడ్ లైన్ విధించిన ఎమ్మెల్యే..!

Srishailam : శ్రీశైలంలో 859 అడుగులకు చేరిన నీటిమట్టం.. కొనసాగుతున్న వరద.. LATEST UPDATE

మరిన్ని వార్తలు