Lipstick: లిప్‌స్టిక్ త్వరగా పోతోందా.. ఈ చిట్కాలు మీకోసమే..!

Lipstick: లిప్‌స్టిక్ త్వరగా పోతోందా.. ఈ చిట్కాలు మీకోసమే..!
మన సాక్షి, ఫీచర్స్ :
పెదాలకు అందాన్ని, రంగును అందించే లిప్‌స్టిక్‌ను చాలామంది ఇష్టపడతారు. ఇంట్లో ఉన్నా, బయటకు వెళ్లినా దీనిని వాడతారు. అయితే, లిప్‌స్టిక్ వేసుకున్న కొద్దిసేపటికే రంగు మారిపోవడం లేదా పూర్తిగా పోవడం వంటి సమస్యలు చాలామందికి ఎదురవుతాయి. ఇలాంటి ఇబ్బంది లేకుండా, ఒకసారి అప్లై చేస్తే రోజంతా నిలిచి ఉండేలా కొన్ని చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. ఆ మెలకువలేంటో తెలుసుకుందాం.
పెదాలను ఎక్స్‌ఫోలియేట్ చేయండి
లిప్‌స్టిక్ ఎక్కువసేపు ఉండాలంటే ముందుగా పెదాలను శుభ్రం చేయాలి. దీనిని ఎక్స్‌ఫోలియేషన్ అంటారు. దీని ద్వారా పెదాలపై ఉన్న నిర్జీవ కణాలు తొలగిపోతాయి. అప్పుడు లిప్‌స్టిక్ సరిగ్గా అంటుకుంటుంది.
ఎలా చేయాలంటే:
టూత్‌బ్రష్ వాడకం: తడిగా ఉన్న పెదాలపై మృదువైన టూత్‌బ్రష్‌తో నెమ్మదిగా రుద్దండి. ఇలా చేయడం వల్ల చర్మంపై ఉన్న మృతకణాలు ఊడిపోతాయి.
సహజ స్క్రబ్: కొద్దిగా పంచదారలో తేనె కలిపి మెత్తటి మిశ్రమం సిద్ధం చేసుకోండి. దీనిని పెదాలపై రాసి సున్నితంగా రుద్దండి. ఎక్కువగా బలంగా రుద్దవద్దు. ఇలా చేస్తే పెదాలు మృదువుగా, అందంగా తయారవుతాయి.
పెదాలను తేమగా ఉంచండి (హైడ్రేషన్)
పెదాలను ఎక్స్‌ఫోలియేట్ చేసిన తర్వాత, వాటిని తేమగా ఉంచడం ముఖ్యం.
ఎలా చేయాలంటే:
మీకు సరిపోయే మంచి మాయిశ్చరైజింగ్ లిప్ బామ్ తీసుకొని పెదాలపై సున్నితంగా రాయండి.
పెదాలు తేమగా మారాలి కానీ, జిడ్డుగా ఉండకూడదు. ఎక్కువైన తేమను తొలగించడానికి బ్లోటింగ్ పేపర్ లేదా టిష్యూ పేపర్‌ను ఉపయోగించండి.
లిప్ ప్రైమర్ వాడకం
లిప్‌స్టిక్ ఎక్కువసేపు నిలిచి ఉండటానికి లిప్ ప్రైమర్ బాగా ఉపయోగపడుతుంది.
ఎలా చేయాలంటే:
పెదాలపై పలుచని పొరలా ప్రైమర్‌ను అప్లై చేయండి. ఇది లిప్‌స్టిక్‌కు మృదువైన ఆధారాన్ని అందిస్తుంది.
మీ వద్ద లిప్ ప్రైమర్ లేకపోతే, తేలికపాటి ఫౌండేషన్ లేదా కన్సీలర్‌ను కూడా అప్లై చేయవచ్చు. ఇది కూడా లిప్‌స్టిక్ ఎక్కువసేపు నిలిచి ఉండేలా చేస్తుంది.
లిప్ లైనర్ ఉపయోగించండి
లిప్ లైనర్ లిప్‌స్టిక్ రంగు బయటకు రాకుండా ఆపడమే కాకుండా, అది ఎక్కువసేపు నిలిచి ఉండటానికి సహాయపడుతుంది.
ఎలా చేయాలంటే:
లిప్‌స్టిక్ వేయడానికి ముందు లిప్ లైనర్‌ను వాడండి. ఇది పెదాలకు ఒక స్పష్టమైన ఆకృతిని ఇస్తుంది.
లిప్‌స్టిక్ అప్లై చేయండి
మంచి నాణ్యత గల లిప్‌స్టిక్‌ను ఎంచుకోండి.
ఎలా చేయాలంటే:
మార్కెట్లో ఎక్కువసేపు ఉండే (లాంగ్ లాస్టింగ్) లిప్‌స్టిక్‌లు చాలా అందుబాటులో ఉన్నాయి. వాటిని ఎంచుకోవచ్చు.
మీరు మ్యాట్, లిక్విడ్ లేదా గ్లాస్ లిప్‌స్టిక్‌లలో మీకు నచ్చిన దానిని ఎంపిక చేసుకోవచ్చు.
లిప్‌స్టిక్ అప్లై చేసే విధానం
లిప్‌స్టిక్‌ను సరైన పద్ధతిలో అప్లై చేయడం వల్ల అది ఎక్కువసేపు నిలిచి ఉంటుంది.
ఎలా చేయాలంటే:
ముందుగా లిప్‌స్టిక్ ఒక పొర వేయండి.
ఆ తర్వాత, మరోసారి అప్లై చేయండి. ఇలా ఒకటి లేదా రెండుసార్లు చేస్తే లిప్‌స్టిక్ ఎక్కువసేపు ఉంటుంది.
చివరగా, ట్రాన్స్‌లెంట్ పౌడర్‌ను కొద్దిగా తీసుకుని పెదాలపై సున్నితంగా బ్రష్ చేయండి. ఈ చిట్కా పాటిస్తే ఉదయం వేసుకున్న లిప్‌స్టిక్ రాత్రి వరకు చెక్కుచెదరకుండా ఉంటుంది.
By : Banoth Santhosh, Hyderabad
MOST READ :
-
Eggs : గుడ్లు పాడైన విషయం తెలుసుకోండిలా.. నిల్వ చేయడం ఎలా..!
-
Jeera water : జీలకర నీరు తాగితే ఏమవుతుందో తెలుసా.. వెంటనే తెలుసుకోండి..!
-
Cyber : పీఎం కిసాన్ యోజన, ఎస్బిఐ రివార్డ్.. పేరుతో సైబర్ మోసాలు.. మెసేజ్ వస్తే ఎలా.. తెలుసుకుందాం..!
-
New Ration Cards : కొత్త రేషన్ కార్డుల జారీపై మంత్రి ఉత్తమ్ కీలక ప్రకటన.. బిగ్ అప్డేట్..!
-
Pimples: నుదుటిపై మొటిమలతో బాధపడుతున్నారా.. ఇలా చేస్తే మచ్చలతో సహా పోతాయి..!









