TOP STORIESBreaking Newsవ్యవసాయం

Runamafi : రుణమాఫీ కానీ వారికి సర్వే అయ్యిందా.. ఐతే ఖాతాలలోకి మాఫీ సొమ్ము..!

Runamafi : రుణమాఫీ కానీ వారికి సర్వే అయ్యిందా.. ఐతే ఖాతాలలోకి మాఫీ సొమ్ము..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

తెలంగాణలో రైతులను రుణ విముక్తులను చేయడానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కంకణం కట్టుకుంది. అధికారంలోకి రాగానే రెండు లక్షల రూపాయల వరకు బ్యాంకు రుణాలు ఉన్న రైతులందరికీ మాఫీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇప్పటికీ మూడు విడతలుగా రుణమాఫీ డబ్బులు రైతుల ఖాతాలలో వేశారు.

కానీ అనేక మందికి రుణమాఫీ కాలేదు. దాంతో రాష్ట్రవ్యాప్తంగా గందరగోళమైన పరిస్థితులు నెలకొన్నాయి. 31 వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేస్తామని 2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 9వ తేదీ వరకు బ్యాంకు రుణాలు తీసుకున్న రైతులందరికీ మాఫీ చేస్తామని ప్రకటించారు.

కానీ అనేకమందికి సాంకేతిక కారణాలవల్ల రుణమాఫీ కాలేదు. ప్రభుత్వం 18 వేల కోట్ల రూపాయలను మాత్రమే రైతుల ఖాతాలలో జమ చేసింది. సుమారుగా ఇంకా 12 వేల కోట్ల రూపాయలకు పైగా మాఫీ చేయాల్సి ఉంది. అందుకోసం రైతులు ఆందోళనలు చెందుతున్నారు.

రెండు లక్షల రూపాయలకు లోపు ఉన్న వారి ఖాతాలు సక్రమంగా లేకపోవడం వల్ల వారి ఖాతాలలో డబ్బులు జమ కాలేదు. అంతే కాకుండా రెండు లక్షల రూపాయలకు పైగా ఉన్నవారికి అదనంగా ఉన్న డబ్బులు చెల్లించాల్సి ఉన్నందున వారికి రుణమాఫీ అందలేదు. దాంతో రాష్ట్రంలో గందరగోళమైన పరిస్థితి నెలకొన్నది.

ప్రభుత్వం అందరికీ రుణమాఫీ చేసేందుకు గాను సాంకేతిక కారణాలను సరిదిద్దేందుకు వ్యవసాయ శాఖ అధికారులతో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసింది. క్షేత్రస్థాయిలో మండలాలు, గ్రామీణ ప్రాంతాలలో సైతం వ్యవసాయ అధికారులు రైతుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఆ తర్వాత రైతు భరోసా యాప్ ద్వారా కుటుంబ వివరాలను సేకరించి యాప్ లో అప్లోడ్ చేశారు.

కుటుంబాన్ని నిర్ధారణ జరిగిన తర్వాత జరిగిన వారితో పాటు.. ఆధార్ కార్డులో తప్పులు, బ్యాంకు కేవైసీ చేసుకోకపోవడం, బ్యాంకు ఖాతాలో పేర్లు తప్పులు ఉన్నవారివి సరి చేశారు. ఇప్పటి వరకు 50 శాతం సర్వే పూర్తయినట్లు తెలుస్తోంది. కాగా ఇప్పటికే అన్ని ఫిర్యాదులను అధికారులకు అందజేసి సర్వే పూర్తి చేసుకున్న రైతులు బ్యాంకులలో రుణమాఫీ డబ్బులు వస్తాయని ఎదురుచూస్తున్నారు.

కాగా ప్రభుత్వం ఇంటింటికి వెళ్లి సర్వే పూర్తి చేసింది. ఇంకా 50% రైతుల వద్దకు వెళ్లాల్సి ఉంది. కాగా అధికారులు సర్వే మొత్తం పూర్తయ్యాకనే ప్రభుత్వం రుణమాఫీ సొమ్ములు బ్యాంకు ఖాతాలలో జమ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది.

ప్రస్తుతం రాష్ట్రంలో రుణమాఫీ ప్రక్రియ కొనసాగుతుందని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అర్హులైన ప్రతి రైతుకు ప్రభుత్వం రుణమాఫీ చేస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే.

2 లక్షల రూపాయలకు పైగా ఉన్నవారికి షెడ్యూల్ ప్రకటించి ఆ ప్రకారంగా మాఫీ చేసే అవకాశాలు ఉన్నాయి. అదే విధంగా ఇంటింటి సర్వే పూర్తయ్యాక రైతులకు వారి ఖాతాలలో రుణమాఫీ డబ్బులు జమ అయ్యే అవకాశం ఉంది.

LATEST UPDATE : 

అయ్యా జిల్లా కలెక్టర్ గారూ.. చదువుకోలేము, పాఠశాల బంద్ చేసి వెళ్లిపోయిన విద్యార్థులు..!

BIG BREAKING : కౌశిక్ రెడ్డి ఇంటికి అరికెపూడి.. రాష్ట్రంలో హై టెన్షన్..!

Jagityal : అక్రమంగా నిల్వ ఉంచిన భారీగా పిడిఎస్ బియ్యం పట్టివేత..!

మహిళలకు సువర్ణావకాశం.. దరఖాస్తు చేసుకున్న రెండు రోజుల్లో రూ.5 లక్షలు..!

మరిన్ని వార్తలు