Loans : రుణాలు ఇప్పిస్తానని నమ్మ బలికిన మహిళ..! ఏం చేసిందంటే..?

రుణాలు ఇప్పిస్తానని నమ్మ బలికిన మహిళ..! ఏం చేసిందంటే..?

మల్కాజిగిరి , మనసాక్షి

రుణాలు ఇప్పిస్తాననిమొహం చాటేసింది ఓ మహిళ.
బ్యాంకు నుండి రుణాలు తీసుకునేందుకు ఎటువంటి అర్హత లేకుండా తమ ఫౌండేషన్ ద్వారా రుణాలు ఇప్పిస్తామని ఓ మహిళ నమ్మబలికింది.
ఈ విషయమై బుధవారం గౌతమ్ నగర్ లో పలువురు బాధిత మహిళలు మంజుల గౌడ్, శ్వేత, ఆనంద్, భారతి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ..

 

హనుమకొండ జిల్లా పరకాలకు చెందిన క్రాంతి జ్యోతి ఫౌండేషన్ నిర్వాహకులు రజిని, రుద్రమ్మ తమ వద్ద నుండి ఒక్కొక్కరి నుండి 18 వేల నుండి 20 వేల వరకు సుమారు 7 లక్షల వరకు వసులు చేశారని తెలిపారు. రుణాలు ఇప్పించమంటే తమకు అందుబాటులోకి రావడం లేదని వారి గోడు విన్నవించుకున్నారు.

తను ఇప్పించే రుణాలతో ఆకూర పరిశ్రమలకు రుణాలు ఉపయోగపడతాయని నమ్మించి డబ్బులు వసూలు చేసింది. ఈ విషయమై పోలీసులకు కూడా ఫిర్యాదు చేశామని అధికారులు తగ చర్యలు తీసుకొని నిరుపేద కుటుంబాలైన మాకు న్యాయం చేయాలని వారు వేడుకున్నారు.