లండన్ లో మంత్రి కేటీఆర్ కి మెమోరాండం

లండన్ లో మంత్రి కేటీఆర్ కి మెమోరాండం

వలిగొండ, మన సాక్షి:

తెలంగాణలో మలిదశ ఉద్యమానికి ఊపిరి పోసిన బెల్లి లలిత జయంతిని మరియు వర్ధంతిని తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని అధికారికంగా జయంతి మరియు వర్ధంతిని నిర్వహించాలని ,కేటీఆర్ లండన్ పర్యటన సందర్భంగా అక్కడ స్థిరపడిన భువనగిరి నివాసి అయిన సుభాష్ లండన్లో కల్వకుంట్ల తారక రామారావుకి వినతి పత్రాన్ని అందజేశారు.

 

అదేవిధంగా బెల్లి లలిత చేసిన పోరాటాలను ఆమె యొక్క త్యాగనిరతిని ఉద్యమం కోసం ఆమె చేసిన పోరాటం అలుపెరుగన్నదని ఆయన కేటీఆర్ కి వివరించారు. ఉద్యమానికిఈ కార్యక్రమంలో భాగంగా ఈనెల 26న బెల్లి లలిత 24వ వర్ధంతి నిర్వహించాలని ఆయన మంత్రిని కోరారు. మంత్రి కేటీఆర్ ఈ విషయంపై సానుకూలంగా స్పందించినట్లు కూడా ఆయన తెలిపారు.

ALSO READ : 

KTR : కర్ణాటక ఎన్నికల ఫలితాలపై కేటీఆర్ ఆసక్తికర ట్వీట్..!

Whatsapp Gas Booking : వాట్సప్ ద్వారా గ్యాస్ బుకింగ్ ఈజీ.. ఎలానో తెలుసుకుందాం ..!