మిర్యాలగూడ : లారీతో సహా సరుకు దొంగతనం.. నిందితుడు అరెస్టు..!

మిర్యాలగూడ : లారీతో సహా సరుకు దొంగతనం.. నిందితుడు అరెస్టు..!

మిర్యాలగూడ, మన సాక్షి

లారీ తో పాటు బియ్యం విక్రయించుకొని దొంగతనం చేసిన సంఘటన నల్గొండ జిల్లా మిర్యాలగూడలో చోటుచేసుకుంది. బుధవారం మిర్యాలగూడ టూ టౌన్ సిఐ నరసింహారావు తెలియజేసిన వివరాల ప్రకారం… హర్యానా రాష్ట్రం మేవాడ్ కు చెందిన జునేద్ అనే వ్యక్తి నరసింహ వద్ద లారీ డ్రైవర్ గా కుదిరాడు. ఏప్రిల్ 6వ తేదీన ఏకశిలా రైస్ మిల్లు నుండి 1200 బియ్యం బ్యాగులను తమిళనాడులోని వెల్లూరులో దిగుమతి చేసేందుకు పంపాడు.

కాగా అతడు అక్కడికి వెళ్లకుండా మధ్యలో బియ్యం విక్రయించుకొని లారీ తో సహా పరారయ్యాడు. హర్యానా కు లారీని తీసుకెళ్లి అక్కడ తన స్నేహితుడి సహాయంతో అమ్మేందుకు ప్రయత్నించారు. ఆ తర్వాత హైదరాబాదులోని మేడ్చల్ లోనే విక్రయించాలని నిర్ణయించుకున్న వారు మేడ్చల్ చెక్పోస్ట్ వద్ద కు రాగానే సమాచారం మేరకు పట్టుకుని అరెస్టు చేసినట్లు సిఐ తెలిపారు.

 

ఈ కేసు డి.ఎస్.పి వెంకటగిరి ఆధ్వర్యంలో చేదించిన ఎస్సై కృష్ణయ్య ,హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు, కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు, రామకృష్ణ లను అభినందించారు