ప్రాజెక్టులో దూకి మహిళా ఆత్మహత్య

ప్రాజెక్టులో దూకి మహిళా ఆత్మహత్య
చింతపల్లి. మన సాక్షి.
జీవితం పై విరక్తి చెంది ఓ మహిళ ప్రాజెక్టు కాలువలో దూకి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన చింతపల్లి మండలంలో మంగళవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వింజమూరు గ్రామానికి చెందిన మలగం వెంకటమ్మ 48 సంవత్సరాలు గత కొంతకాలంగా మతిస్థిమితం బాగా లేక తాను బ్రతకను చచ్చిపోతారంటూ పలుమార్లు కుటుంబ సభ్యులతో చెప్పినట్లు సమాచారం.
మృతురాలి తమ్ముడు వీరమల్ల చిన్న వెంకటయ్య సోమవారం తన అక్క అయిన మలగం వెంకటమ్మను పశువుల వద్ద కాపలాగా పెట్టి బ్యాంకు పనిపై చిన్న వెంకటయ్య దేవరకొండ కు వెళ్లాడు. పశువుల వద్ద కాపలాగా ఉన్న వెంకటమ్మ సాయంకాలం వరకు ఇంటికి తిరిగి రాకపోవడంతో అక్కడక్కడ వెతికినప్పటికీ ఆమె ఆచూకీ తెలియ రాలేదు.
మంగళవారం ఉదయం చింతపల్లి ప్రాజెక్టు వద్ద ఆమె చెప్పులు కనిపించడంతో చెరువులో దూకి ఆత్మహత్య పాడ్పడినట్లు గమనించారు. సంఘటన విషయం తెలుసుకున్న ఎస్ ఐ బాలకృష్ణ ఆత్మహత్య పాల్పడిన వివరాలను సేకరించి వారి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.