Mallu swarajyam : మల్లు స్వరాజ్యం.. జీవితం స్ఫూర్తిదాయకం..!

వీరనారి మల్లు స్వరాజ్యం జీవితం స్ఫూర్తిదాయకమని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి అన్నారు. మంగళవారంసూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని 11వ వార్డు రాయుని గూడెం లో తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, సిపిఎం కేంద్ర కమిటీ సభ్యురాలు, తుంగతుర్తి మాజీ శాసన సభ్యురాలు మల్లు స్వరాజ్యం ద్వితీయ వర్ధంతి సందర్భంగా ఆమె జ్ఞాపకార్థం ఆమె కుటుంబ సభ్యులు నిర్మించిన మల్లు స్వరాజ్యం స్మారక కళా వేదికను ఆయన ప్రారంభించి అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.

Mallu swarajyam : మల్లు స్వరాజ్యం.. జీవితం స్ఫూర్తిదాయకం..!

సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి

సూర్యాపేట రూరల్, మనసాక్షి

వీరనారి మల్లు స్వరాజ్యం జీవితం స్ఫూర్తిదాయకమని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి అన్నారు. మంగళవారంసూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని 11వ వార్డు రాయుని గూడెం లో తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, సిపిఎం కేంద్ర కమిటీ సభ్యురాలు, తుంగతుర్తి మాజీ శాసన సభ్యురాలు మల్లు స్వరాజ్యం ద్వితీయ వర్ధంతి సందర్భంగా ఆమె జ్ఞాపకార్థం ఆమె కుటుంబ సభ్యులు నిర్మించిన మల్లు స్వరాజ్యం స్మారక కళా వేదికను ఆయన ప్రారంభించి అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.

ఈ తరానికి ఆమెఒక స్ఫూర్తి అని ఆమె పోరాటం అందరికీ ఆదర్శం అని అన్నారు. తుపాకీ పట్టి నిజాం కడగల్లాలించిన వీరవనిత మల్లు స్వరాజ్యం అన్నారు. ఆడవాళ్లు అబలలు కాదు సభలు అని నిరూపించిన యోధురాలు మల్లు స్వరాజ్యం అన్నారు. బిజెపి, ఆర్ఎస్ఎస్ దుర్మార్గంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి మతం రంగు వస్తుందన్నారు. ఇది ఆనాటి అమరవీరుల త్యాగానికి ద్రోహం చేసినట్టునని బిజెపి పై మండిపడ్డారు. వీర తెలంగాణ సాయుధ పోరాట వారసత్వమైన లౌకికత్వాన్ని రక్షించుకోవాల్సిన అవసరం మనందరి పైన ఉందని అన్నారు.

దేశంలో బిజెపి మతసామరస్యాన్ని చెడగొట్టి మతోన్మాదాన్ని పెంచి పోషించాలన్న కుట్రలను అడ్డుకోవడానికి లౌకికవాద శక్తులు, రాజకీయ పార్టీలు భాగస్వామ్యం కావాలని కోరారు. దేశానికి బిజెపి ప్రమాదకరమైతే అత్యంత ప్రమాదకరం దానిఆర్ఎస్ఎస్ భావజాలం అన్నారు. నమ్మిన ఆశయం కోసం కొట్లాడిన వీరవనిత స్వరాజమని ఆమె ఆశయ సాధనకు మనమంతా కృషి చేయాలని అన్నారు.నాడు తుంగతుర్తి నియోజకవర్గం లో జరిగిన దాడులను, ఘర్షణలు హత్యల నుండి పార్టీ క్యాడర్ ను కాపాడిందన్నారు. నేటి యువత కు ఆమె జీవితం స్ఫూర్తిదాయకమన్నారు.

తెలంగాణలో మొట్టమొదటగా తుపాకీ పట్టిన మహిళాగా మల్లు స్వరాజ్యం కీర్తి ఘటించారని అన్నారు. మల్లు స్వరాజ్యమును పట్టిస్తే 10000 బహుమతి ఇస్తానని ఆనాడు నైజాం ప్రకటించడం అంటే ఆమె ఎంత గొప్పగా పోరాడారో అర్థం అవుతుందన్నారు. మహిళ ఉద్యమానికి మల్లు స్వరాజ్యం దిక్సూచిగా దిగిచారని అన్నారు. తన జీవితాంతం ప్రజల కోసం నిస్వార్ధంగా పనిచేసిన మహా నాయకురాలు మల్లు స్వరాజ్యం అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ పోరాటం జరిగితే అక్కడ మల్లు స్వరాజ్యం ప్రత్యక్షమయ్యే వారిని పూర్తి చేశారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన సారా వ్యతిరేక ఉద్యమంలో మల్లు స్వరాజ్యం నిర్వహించిన పాత్ర మరోలిందన్నారు. మహిళలకు సంపూర్ణ స్వరాజ్యంరావాలని ఆమె నిరంతరం తపించేవారని ఆ దిశగా అనేక ఉద్యమాలు నిర్వహించాలని గుర్తు చేశారు. చట్ట సభలకు వన్నెతెచ్చిన మహానేత మల్లు స్వరాజ్యం అన్నారు. ప్రస్తావిస్తే అధికార పార్టీ నాయకులు హాడలిపోయే వారన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా అభివృద్ధిలో మల్లు స్వరాజ్యం ప్రముఖ పాత్ర పోషించాలని అన్నారు.

మహిళ అయినప్పటికీ పురుషులతో ఏమాత్రం తీసుకొని విధంగా పని చేశారని అన్నారు. నిస్వార్ధంగా ఈ ప్రాంత ప్రజల మనసును దోచుకున్న నాయకురాలు మల్లు స్వరాజ్యం అన్నారు. నేడు దేశంలో అధికారంలోకి వచ్చిన బిజెపి ప్రభుత్వం మహిళల పట్ల చిన్నచూపు చూస్తుందని విమర్శించారు. బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలపై దాడులు దౌర్జన్యాలు పెరుగుతున్నాయని వాటిని ఎదుర్కొనేందుకు ప్రతి మహిళ మల్లు స్వరాజ్యం కావాలని పిలుపునిచ్చారు. స్వరాజ్యం అంటే వ్యక్తి కాదు మహా శక్తి ఆమె ఒక ఉద్యమ కిరణం అని అన్నారు.

అనంతరం ఆమె చిత్రపటానికి పూలమాలవేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ప్రజానాట్యమండలి కళాకారులు ఆలపించిన విప్లవ గేయాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రజలను విశేషంగా ఆకట్టుకున్నాయి. సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సభలో ప్రముఖ రాజకీయ నాయకురాలు పాదూరి కరుణ, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులునెమ్మాది వెంకటేశ్వర్లు, కోలిశెట్టి యాదగిరి రావు, మట్టిపల్లి సైదులు, మేదరమెట్ల వెంకటేశ్వరరావు, కోట గోపి, చెరుకు ఏకలక్ష్మి, సిపిఎం పార్టీ త్రీ టౌన్ కార్యదర్శిమేకన పోయిన శేఖర్,11వ వార్డు కౌన్సిలర్ఎడ్ల గంగాభవాని,

కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు ఎల్గూరి వెంకటేశం, బిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులుముత్యాల పిచ్చయ్య,ప్రముఖ న్యాయవాదిమల్లు కపోతం రెడ్డి,విశ్రాంత ఉపాధ్యాయులుమల్లు వెంకటరామిరెడ్డి,పాఠశాల ప్రధానోపాధ్యాయులుకాసర్ల వీరారెడ్డి,సిపిఎం మండల కమిటీ సభ్యులు మందడి రాంరెడ్డి, మాజీ ఎంపీటీసీ కామల్ల లింగయ్య, సిపిఎం గ్రామ శాఖ కార్యదర్శిలుమాణిక ఎల్లయ్య,నారాయణ వీరారెడ్డితదితరులు పాల్గొన్నారు.