Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

నిజాలను నిర్భయంగా రాస్తున్న మన సాక్షి పత్రిక.. అడిషనల్ ఎస్పీ పీ.మౌనిక..!

నిజాలను నిర్భయంగా రాస్తున్న మన సాక్షి పత్రిక.. అడిషనల్ ఎస్పీ పీ.మౌనిక..!

దేవరకొండ, మనసాక్షి :

నల్గొండ జిల్లా దేవరకొండ పట్టణ కేంద్రంలో గురువారం నాడు దేవరకొండ అడిషనల్ ఎస్పీ కార్యాలయంలో అడిషనల్ ఎస్పీ పీ.మౌనిక, ఆధ్వర్యంలో మన సాక్షి 2025 నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ చేశారు.

మన సాక్షి క్యాలెండర్ ఆవిష్కరణలో భాగంగా అడిషనల్ ఎస్పీ పీ. మౌనిక… మాట్లాడుతూ నేటి సమాజంలో పత్రికల పాత్ర చాలా కీలకమైందని, సమాజానికి, ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా పత్రికలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని పత్రికలకు స్వేచ్ఛ చాలా ముఖ్యమని, వివిధ పత్రికలలో పనిచేసే జర్నలిస్టులకు, పత్రికలకు స్వేచ్ఛ ఉండాలని అన్నారు.

ఎవరికి భయపడకుండా నిర్భయంగా, నిస్సంకోచంగా, వార్తలు వాస్తు మన సాక్షి పత్రిక ప్రజలకు చేరువ అవుతుందన్నారు. ప్రజలందరి ఆదరాభిమానాలతో పత్రికా రంగంలో నూతన ఒరవడితో అనధికాలంలోనే విశ్వసనీయమైన సమాచారాన్ని అందించే పత్రికల్లో మన సాక్షి పత్రిక ఒకటి అని తెలిపారు. మనసాక్షి పత్రిక యజమాన్యానికి సిబ్బందికి శుభాకాంక్షలు తెలియజేశారు.

దేవరకొండ పట్టణ కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్లో దేవరకొండ ఎస్ హెచ్ ఓ. నర్సింహులు ఆధ్వర్యంలో గురువారం స్టేషన్ ఎస్ హెచ్ ఓ నర్సింహులు మన సాక్షి క్యాలెండర్ ను ఆవిష్కరించారు.అనంతరం వారు మాట్లాడుతూ…ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు జర్నలిస్టులు ముందు ఉంటారని అన్నారు.

అలాగే అవినీతి అక్రమాలపై కూడా కథనాలు రాసి అధికారుల దృష్టికి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని ఆయన కోరారు. పత్రికలు అంటే ప్రజాస్వామ్యానికి నాలుగు స్తంభమని అని వర్ణించారు.ఈ కార్యక్రమంలో మన సాక్షి రిపోర్టర్ సయ్యద్ ఫయాజ్, పోలీస్ సిబ్బంది ఉన్నారు.

MOST READ : 

మరిన్ని వార్తలు