కంగ్టిలో మనసాక్షి క్యాలెండర్‌ ఆవిష్కరణ 

సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల కేంద్రంలో ఎంపిడిఓ కార్యాలయంలో మన సాక్షి దినపత్రిక నూతన సంవత్సర 2024 క్యాలెండర్‌ ను ఎంపిడిఓ ముజఫరోద్దీన్ ఆవిష్కరించారు.

కంగ్టిలో మనసాక్షి క్యాలెండర్‌ ఆవిష్కరణ 

– ఎంపిడిఓ ముజఫరోద్దీన్

కంగ్టి, మన సాక్షి :-

సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల కేంద్రంలో ఎంపిడిఓ కార్యాలయంలో మన సాక్షి దినపత్రిక నూతన సంవత్సర 2024 క్యాలెండర్‌ ను ఎంపిడిఓ ముజఫరోద్దీన్ ఆవిష్కరించారు. బుధవారం ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…

ప్రజలకు ప్రభుత్వానికి వారదిల పనిచేస్తున్న మన సాక్షి దినపత్రికను అభినందించారు. మంచి కథనాలతో ఎప్పటికప్పుడు ప్రజలకు చేరువవుతున్న పత్రిక మనసాక్షి అని కొనియాడారు. ప్రజల సమస్యలు ఏదైనా ఉంటే తన దృష్టికి తీసుకురావాలని ప్రజా సమస్యలను తన వంతు కృషి చేస్తానని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎంపివో వినోద్ కుమార్, సీనియర్ అసిస్టెంట్ రమేష్, జర్నలిస్టులు జలిల్ రుస్తుం, చంద్రకాంత్ ఉన్నారు.