Maoist : రామగుండం సీపీ ఎదుట లొంగిపోయిన మావోయిస్టులు..!

Maoist : రామగుండం సీపీ ఎదుట లొంగిపోయిన మావోయిస్టులు..!
గోదావరిఖని, మనసాక్షి :
నాలుగు దశాబ్దాలపాటు సిపిఐ మావోయిస్టు లో పనిచేసిన సీనియర్ మావోయిస్టు నాయకులు ఆత్రం లచ్చన్న, చౌదరి ఆంకుభాయిలు రామగుండం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో లొంగిపోయారు. వారికి రామగుండం సిపి అంబర్ కిషోర్ ఝా 25 లక్షల రివార్డు అందచేశారు.
ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ ఆత్రం లచ్చన్న అలియాస్ గోపన్న 1993లో సిపిఎం మావోయిస్టు పార్టీ గల సభ్యునిగా చేరి చెన్నూరు దళంలో పనిచేశాడు. 2002లో పదోన్నతి పొంది సిర్పూర్ దళానికి బదిలీ అయ్యాడు. ఆయనపై తెలంగాణలోని వివిధ జిల్లాల 35 కేసులు నమోదైనట్టు తెలిపారు.
చౌదరి అంకు బాయ్ అలియాస్ సంతక్క అలియాస్ లక్ష్మి ఫై 14 కేసులు నమోదు అయినట్టు తెలిపారు. 1988లో సిపిఐ ఎంఎల్ పిడబ్ల్యూ దళసబ్బిరాలిగా చేరి సిర్పూర్ దళంలో పనిచేస్తుంది. సిర్పూర్ దళం డిప్యూటీ కమాండర్ గా పనిచేస్తున్న ఆత్రంలచ్చనని వివాహం చేసుకుంది.
మీ ఊరికి రండి! మావోయిస్టులకు పోలీస్ వారి ఆహ్వానం!!
అజ్ఞాతములో ఉన్న మావోయిస్టులను జన జీవన స్రవంతి లోకి రావాలిసినది గా కోరారు.. తెలంగాణ మావోయిస్టులు వారి గ్రామాలకు తిరిగి రావాలని, తెలంగాణ అభివృద్దికి తోడ్పడాలన్నారు.
అజ్ఞాత మావోయిస్టులు వారి గ్రామాలకు తిరిగి వచ్చినట్లయితే, తెలంగాణ ప్రభుత్వం లొంగిపోయిన మావోయిస్టులకు ఇచ్చే పునరావాస పథకాలు, ఇతర సహాయ సహకారాలు అందిస్తుందన్నారు.లొంగిపోయిన సభ్యులకు జీవనోపాధి పునరావాసం కల్పించడం కోసం ప్రభుత్వం తరఫున అందవలసిన అన్ని ప్రతిఫలాలను అందజేయడానికి రామగుండం కమిషనరేటు పోలీసు శాఖ ఎల్లప్పుడూ కృషి చేస్తుందని హామీ ఇచ్చారు.
ప్రజా సంఘాల ముసుగులో దందాలు
కొంతమంది వ్యక్తులు ప్రజా సంఘాల ముసుగులో శాంతి భద్రతలకు భంగం కలిగించే రీతిలో వ్యవహరిస్తున్నారని, అలాంటి వారిపై పోలీసు నిఘా కొనసాగుతుందన్నారు.
ఈ విలేకరుల సమావేశంలో మంచిర్యాల డిసిపి భాస్కర్ ఐపీఎస్, అడిషనల్ డీసీపీ అడ్మిన్ సి రాజు, జైపూర్ ఎసిపి వెంకటేశ్వర్లు, స్పెషల్ బ్రాంచ్ ఏసిపి మల్లారెడ్డి, చెన్నూరు రూరల్ సీఐ బన్సీలాల్, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రాజేంద్రప్రసాద్, కోటపల్లి ఎస్సై రాజేందర్, నీల్వాయి ఎస్సై శ్యాం పటేల్, సిబ్బంది పాల్గొన్నారు.
MOST READ :
-
Suryapet : సూర్యాపేట జిల్లాలో విషాదం.. కస్తూరిబా పాఠశాలలో విద్యార్థిని ఆత్మహత్య..!
-
CM Revanth Reddy : పదేళ్లలో రేషన్ షాపులు తెరవలేదు.. కానీ బెల్ట్ షాపులు తెరిచారు.. సీఎం రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు..!
-
Street Foods: స్ట్రీట్ ఫుడ్స్ తింటున్నారా.. కేంద్రం హెచ్చరిక..!
-
Lipstick: లిప్స్టిక్ త్వరగా పోతోందా.. ఈ చిట్కాలు మీకోసమే..!
-
Jeera water : జీలకర నీరు తాగితే ఏమవుతుందో తెలుసా.. వెంటనే తెలుసుకోండి..!









