New Model Maruthi : మారుతి సుజుకి డిజైర్ 2024 కారు లాంచింగ్.. కేవలం రూ. 11000 బుకింగ్..!
New Model Maruthi : మారుతి సుజుకి డిజైర్ 2024 కారు లాంచింగ్.. కేవలం రూ. 11000 బుకింగ్..!
నల్లగొండ, మన సాక్షి,
నల్లగొండలోని పవన్ మోటార్స్ షోరూమ్ లో మంగళవారంనల్గొండ ఎస్పీ చరత్ చంద్ర పవార్ పవన్ మోటర్స్ చైర్మన్ కోమటిరెడ్డి మోహన్ రెడ్డి ఎండీ చంద్రపవన్ రెడ్డి లు కొత్త మారుతి సుజుకి డిజైర్ 2024 డిజైర్ కారును విడుదల చేశారు.
ఈ కారు నుద్దెచ్చించి పవన్ మోటర్స్ ఎండీ చంద్ర పవన్ రెడ్డి మాట్లాడుతూ ఈ కారు ఎల్ఎక్స్ఐ, విఎక్స్ఐ, జెడ్ఎక్స్ఐ, జెడ్ఎక్స్ఐ ప్లస్ అనే నాలుగు వేరియంట్లలో లభిస్తుందని తెలిపారు.డిజైర్ పెట్రోల్ ఆటోమేటిక్ (ఎఎమ్‌టీ) పవర్‌ట్రెయిన్ బేస్ డిజైర్ మోడల్ మినహా అన్ని వేరియంట్లలో లభిస్తుందని కేవలం రూ.11,000 ప్రారంభ ధరతో కంపెనీ తన బుకింగ్‌ను ప్రారంభించిందన్నారు.
వినియోగదారుల భద్రతా అవసరాలను తీర్చడానికి మారుతి సుజుకి 2024 మారుతి డిజైర్ ను చాలా సురక్షితంగా మేకింగ్ చేసింది. ఇది గ్లోబల్ ఎన్సీఏపీలో 5 స్టార్ రేటింగ్ పొందిందని, పెద్దల కోసం 5 స్టార్ క్రాష్ టెస్ట్ రేటింగ్, పిల్లల రక్షణ కోసం 4 స్టార్ క్రాష్ టెస్ట్ రేటింగ్సాధించింది.
ఆన్-బోర్డ్ సేఫ్టీ ఎక్విప్‌మెంట్‌లో మొత్తం 6 ఎయిర్ బ్యాగులు ఉన్నాయి. ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, రివర్స్ పార్కింగ్ కెమెరా, ఏబీఎస్, ఈబీడీ, క్రూయిజ్ కంట్రోల్, పుష్ బటన్ స్టార్ట్/స్టాప్ వంటి అద్భుతమైన ఫీచర్లు ఈ కారులో ఉన్నాయి.
ఫీచర్ అప్డేట్లను ఎక్స్టీరియర్, ఇంటీరియర్ అంతటా చూడవచ్చని హారిజాంటల్ స్లాట్లతో కూడిన పెద్ద ఫ్రంట్ గ్రిల్, స్లీక్ ఎల్ఈడీ డీఆర్ఎల్లు, క్రోమ్ స్ట్రిప్‌కు కనెక్ట్ చేసిన వై సైజ్ ప్యాట్రన్‌లో కొత్త ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్స్, కొత్త 15 అంగుళాల డ్యూయల్ టోన్ అల్లాయ్ వీల్స్ ఉన్నాయి అన్నారు.
ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో రెండింటినీ సపోర్ట్ చేసే పెద్ద 9-అంగుళాల ఫ్లోటింగ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్ మెంట్ సిస్టమ్ ను పొందుతుంది. దాని ఫ్యాక్టరీ-అమర్చిన సింగిల్ పాన్ సన్ రూఫ్ సబ్-4 మీటర్ల కాంపాక్ట్ సెడాన్ సెగ్మెంట్ లో అందించే సెగ్మెంట్-ఫస్ట్ ఫీచర్. కొత్త డిజైర్ 3,995 మిమీ పొడవు, 1,735 మిమీ వెడల్పు, 1,525 మిమీ ఎత్తు, 2,450 మిమీ పొడవైన వీల్ బేస్ కలిగి ఉంది.
దీనికి 163 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్, 382 లీటర్ల బూట్ స్పేస్ లభిస్తుంది. ఇంటీరియర్ లైట్ బీజ్, బ్లాక్ కలర్ క్యాబిన్‌తో పరిచయం చేశారు.ఈ కార్యక్రమం లో పవన్ మోటార్స్ ఎండీ కోమటిరెడ్డి చంద్రపవన్ రెడ్డి , చైర్మన్ కోమటిరెడ్డి మోహన్ రెడ్డి బిజినెస్ హెడ్ రవిరెడ్డి ఏజీఎం సీతారాం రెడ్డి పాల్గొన్నారు.
MOST READ :










