Narayanpet : భారీగా గుట్కా ప్యాకెట్లు పట్టివేత..!
Narayanpet : భారీగా గుట్కా ప్యాకెట్లు పట్టివేత..!
నారాయణపేట టౌన్, మనసాక్షి :
నారాయణపేట జిల్లా కేంద్రంలో సోమవారం సత్యసాయి కాలనీకి చెందిన పూరి శ్రీధర్ రేకుల షెడ్డులో నమ్మదగిన సమాచారం మేరకు పెద్ద మొత్తంలో ప్రభుత్వ నిషేధిత గుట్కా ప్యాకెట్లను (విమల్, సాగర్) లను నిల్వ ఉంచారని సమాచారంతో టాస్క్ ఫోర్స్, నారాయణపేట పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించి పట్టుకున్నట్లు ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపారు.
పట్టుబడ్డ అట్టి గుట్కా ప్యాకెట్ల విలువ 6,80,460/-రూపాయలు ఉంటుందని ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపారు. పట్టుబడిన నిషేధిత గుట్కా ప్యాకెట్ల సంచులను పోలీస్ స్టేషన్ కు తరలించి పూరి శ్రీధర్ పై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపారు.
నారాయణపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రభుత్వం నిషేధించినటువంటి గుట్కా ప్యాకెట్లను ఎవరైనా అక్రమంగా నిల్వ ఉంచిన, ప్రజలకు అమ్మిన, రవాణా చేసిన అట్టి వ్యక్తులపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎస్ఐ హెచ్చరించారు.
MOST READ :
-
Toll Tax : ఇక ఆ.. వాహనాలు టోల్ టాక్స్ కట్టాల్సిన పనిలేదు.. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం..!
-
PI Phone : ఇంటర్నెట్, చార్జింగ్ అవసరం లేని స్మార్ట్ ఫోన్.. డిసెంబర్ లో లాంచ్, తెగ వైరల్..!
-
Rythu : రైతులకు అదిరిపోయే న్యూస్.. రేపే ఖాతాలోకి డబ్బులు..!
-
Jobs : నిరుద్యోగులకు శుభవార్త.. టెన్త్ అర్హత ఉంటే చాలు.. కోర్టులో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం..!









