Mavoist : మావోయిస్టులకు నగదు తరలిస్తున్న.. ఆ నలుగురు..!

మావోయిస్టులకు నగదు తరలిస్తున్న.. ఆ నలుగురు..!

భూపాలపల్లి, మనసాక్షి :

ఛత్తీస్గడ్ రాష్ట్రంలో ని మావోయిస్టులకు రూ. 77 లక్షల నగదు, మెడికల్ కిట్లు, జిలిటన్ స్టిక్స్, సెల్ ఫోన్లు, స్మార్ట్ వాచ్లు సరఫరా చేస్తున్న నలుగురిని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం పోలీసులు పట్టుకున్నారు.

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ సురేందర్ రెడ్డి గురువారం మీడియా సమావేశంలో అరెస్టుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు.

 

పోలీసులు అరెస్టు చేసిన వారిలో కరీంనగర్ సవరన్ స్ట్రీట్ కు చెందిన అబ్దుల్ అజీజ్, హుజురాబాద్ మామిడి గడ్డివాడకు చెందిన అబ్దుల్ రజాక్, చత్తీస్గడ్ బీజాపూర్ జిల్లాకు చెందిన రాఘవ్, వెస్ట్ బెంగాల్ కు చెందిన కౌశల్ అలీ ఉన్నారు.

 

వీరితోపాటు పరారీలో ఉన్న మహమ్మద్ రవుఫ్, ఆత్రం నారాయణ, మారుపాక రామయ్య, వర్గీస్ , భాస్కర్, దిలీప్, ఉంగ, వెళ్ళల్ పై ఎఫ్ ఐ ఆర్ నమోదు చేసినట్లు ఎస్పి తెలిపారు.

 

నిందితులను అరెస్టు చేయడంలో చాకచక్యంగా వ్యవహరించిన ఓ ఎస్ డి అశోక్ కుమార్, కాటారం డిఎస్పి రామ్మోహన్ రెడ్డి , సిఐ రంజిత్ రావు , ఎస్ఐ శ్రీనివాస్, మహాదేవపూర్ ఎస్ఐ రాజకుమార్, కాలేశ్వరం ఎస్సై లక్ష్మణరావు, కొయ్యూరు ఎస్ఐ నరేష్, అడవి ముత్తారం ఎస్సై సుధాకర్ లను ఎస్పీ సురేందర్ రెడ్డి అభినందించారు.