తెలంగాణBreaking Newsఖమ్మం జిల్లాజిల్లా వార్తలు

Khammam : వరద ప్రాంతాల్లో 820 ప్రత్యేక బృందాలతో వైద్య సేవలు..!

Khammam : వరద ప్రాంతాల్లో 820 ప్రత్యేక బృందాలతో వైద్య సేవలు..!

నేలకొండపల్లి,  మన సాక్షి:

ఖమ్మం జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాలలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు 820 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి(డీయంఅండొచ్ఐవో) డాక్టర్.సుబ్బారావు తెలిపారు. మండలం లోని బోదులబండ ప్రాధమిక ఆరోగ్య కేంద్రం ను ఆదివారం ఆకస్మిక సందర్శించారు. పలు రికార్డులు పరిశీలించారు.

రోగులకు అందుతున్న వైద్య సేవలు గురించి అడిగి తెలుసుకున్నారు. అదే విధంగా సిబ్బంది కి పలు సూచనలు, సలహాలు అందించారు. అనంతరం వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటించారు. ఈ -సందర్భంగా ఆయన విలేకర్లతో మాట్లాడారు… జిల్లాలో ముంపు ప్రాంతాలలో మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నటు తెలిపారు. అందుకోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని పేర్కోన్నారు.

ఈ సీజన్ లో ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 460 డెంగీ కేసులు నమోదైయ్యాయాని తెలిపారు. వర్షాల వలన జ్వరపీడీత కేసులు తగ్గినట్లు తెలిపారు. జిల్లాలోని అన్ని ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలలో మందులు సరిపడ అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. ప్రజలు వ్యక్తిగత పరిశుభ్రత చాలా అవసరం అన్నారు.

దోమలు పుట్టకుండా, కుట్టకుండా చూసుకోవాలని అన్నారు. జ్వరాలు తగ్గినప్పటికీ జలుబు. దగ్గు వచ్చేఅవకాశం ఉందని కావునా ప్రజలు అప్రమతంగా ఉండాలని అన్నారు. కాచి, చల్లార్చిన నీటిని త్రాగాలని అన్నారు.

ముంపు ప్రాంతాలలో ఏర్పాటు చేసిన శిభిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్.గీత, స్టాఫ్ నర్స్ లు శ్రీలత, రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

LATEST UPDATES : 

Cm Revanth Reddy : తెలంగాణ ప్రజలకు మరో గుడ్ న్యూస్.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన..!

Runamafi : రుణమాఫీ పై స్పష్టత.. మాఫీ కాని వారికి ఎప్పుడంటే..!

Rythu : తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. రైతు బీమా కోసం మొబైల్ యాప్..!

తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. వారి ఖాతాలలో నేటి నుంచి రూ.10వేలు..!

మరిన్ని వార్తలు