TOP STORIESBreaking Newsరంగారెడ్డివిద్య

Shankarpally : శంకర్‌పల్లి ఎస్సీ బాలుర వసతి గృహంలో కనీస వసతులు కరువు..!

Shankarpally : శంకర్‌పల్లి ఎస్సీ బాలుర వసతి గృహంలో కనీస వసతులు కరువు..!

సమస్యలను తీర్చాలని అధికారులను, ప్రజా ప్రతినిధులను కోరిన విద్యార్థులు

శంకర్‌పల్లి, (మన సాక్షి):

శంకర్‌పల్లి మండల కేంద్రంలోని దళిత సంక్షేమ శాఖ ప్రభుత్వ బాలుర వసతి గృహంలో విద్యార్థులు అనేక సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వసతి గృహంలో మూడవ తరగతి నుండి పదవ తరగతి వరకు విద్యార్థులు ఉన్నారు. వసతి గ్రహంలో 103 విద్యార్థులకు ప్రస్తుతం 45 మంది విద్యార్థులు మాత్రమే ఉన్నారు.

విద్యార్థులు ఉదయం తినే అల్పాహారం కిచిడి, పులిహోర సరిగ్గా లేదని ఆరోపించారు. వారానికి ఏడు రోజులకు ఏడు రకాల అల్పాహారం అందించాలి. కానీ ప్రతిరోజు ఒకే రకం అల్పాహారాన్ని వడ్డిస్తున్నారని వాపోతున్నారు.

పప్పులో నీరు మాత్రమే ఉంటున్నది పప్పు మాత్రం లేదన్నారు. రాత్రికి డిన్నర్ టైంలో వడ్డించే ఆహారం అన్నం, పప్పు, కూర, గుడ్డు, పెరుగు నాణ్యతగా లేవని విద్యార్థులు వెల్లడించారు. ఎక్కడ పడితే అక్కడ చెత్త ఉంటుందన్నారు. హాస్టల్ ఆవరణలో కోతులు, కుక్కలు సంచరిస్తున్నాయి.

స్నానాల గదులకు తలుపులు కూడా సరిగ్గా లేవని, స్నానాలు చేయడానికి గదులు సరిపోవడం లేదని తెలిపారు. అధికారులు, ప్రజాప్రతినిధులు వసతి గృహంలో ఉన్న సమస్యలను తీర్చాలని విద్యార్థులు శనివారం మన సాక్షి దిన పత్రిక ప్రతినిధి ద్వారా కోరారు.

MOST READ

  1. Miryalaguda : మిర్యాలగూడలో ప్రత్యేక నార్కోటిక్స్ డ్రగ్ స్నైపర్ డాగ్ తో తనిఖీలు..!

  2. Budget: బడ్జెట్ ముందు హల్వా వేడుక.. ఎందుకు నిర్వహిస్తారో తెలుసా?

  3. Nalgonda : కేసీఆర్.. నేను దెబ్బ కొడితే ఏక్కడ ఉంటావో తెలుసుకో.. మంత్రి కోమటిరెడ్డి పంచ్..!

  4. Osmania Hospital : 14 అంతస్తులలో ఉస్మానియా ఆస్పత్రి.. నూతన భవనానికి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన..!

మరిన్ని వార్తలు