తెలంగాణBreaking Newsఖమ్మం జిల్లాజిల్లా వార్తలురాజకీయం

Minister Ponguleti : ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి పొంగులేటి కీలక ప్రకటన.. బిగ్ అప్డేట్..!

Minister Ponguleti : ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి పొంగులేటి కీలక ప్రకటన.. బిగ్ అప్డేట్..!

మన సాక్షి, ఖమ్మం :

తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తూ ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలను అందజేస్తుంది. కాగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పై రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. బుధవారం ఆయన ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీలో సత్యనారాయణపురంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు పట్టాలు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్లలో ఆర్హులందరికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. నాలుగున్నర లక్షల ఇందిరమ్మ ఇళ్ళను మొదటి విడతలో భాగంగా ప్రకటించినట్లు తెలిపారు. ఇందిరమ్మ ఇళ్లు ఇస్తున్న తమ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. తమ ప్రభుత్వానికి పేదవారిపట్ల ప్రేమ, అభిమానాలు ఉన్నాయని, చిత్తశుద్ధి ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు.

రాబోయే నాలుగు సంవత్సరాలలో 20 లక్షల ఇందిరమ్మ ఇల్లు కట్టాలనేదే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. పాలేరు నియోజకవర్గం లో ప్రతి ఇంటికి పెద్ద కొడుకుగా ఉండి అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తానని హామీ ఇచ్చారు. ప్రతి ఆడబిడ్డ, తమ్ముడి కళ్ళలో ఆనందాన్ని చూస్తుంటే భావోద్వేగానికి లోనవుతున్నామని ఆయన పేర్కొన్నారు. 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ రేషన్ కార్డులు కూడా ఇవ్వాలనే ఇంగిత జ్ఞానం లేదని ఆయన విమర్శించారు. ఇందిరమ్మ ప్రభుత్వంలో 19 లక్షల మంది పేర్లను కొత్త రేషన్ కార్డులో జమ చేసినట్లు ఆయన తెలిపారు.

ధనిక రాష్ట్రంలో 8 లక్షల పంతొమ్మిది వేలకోట్ల రూపాయలు అప్పు చేసిపోతే ప్రతినెల 6,500 కోట్ల రూపాయలను వడ్డీని తమ ప్రభుత్వం చెల్లిస్తున్నట్లు శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. కెసిఆర్ పాలనలో తమ కుటుంబ సభ్యులు కట్టుకున్న ప్యాలెస్ లు, అధికారులు, ప్రజాప్రతినిధులు నివసించే బంగ్లాల మీద ఉన్న శ్రద్ధ పేదలు నివసించే ఇండ్లపై ఎందుకు శ్రద్ధ పెట్టలేదని ఆయన పేర్కొన్నారు.

MOST READ :

  1. Kanagal : తాను మరణించినా.. మరొకరికి దారి చూపిన హెడ్ కానిస్టేబుల్..!

  2. District collector : జిల్లా కలెక్టర్ కీలక ఆదేశాలు.. వాటర్ షెడ్ పనుల పరిశీలన..!

  3. Tea : టీ తో బిస్కెట్ కలిపి తింటున్నారా.. అయితే ఏం జరుగుతుందో తెలుసుకోవాల్సిందే..!

  4. Rythu Bharosa : వారికే ఒకేసారి రైతు భరోసా.. ఎప్పుడో తెలుసా.. లేటెస్ట్ అప్డేట్..!

  5. Ration Cards : రేషన్ కార్డుదారులకు ఊహించని షాక్.. వారి కార్డులు రద్దు..!

మరిన్ని వార్తలు