Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsక్రీడలుజిల్లా వార్తలుమెదక్

Damodara Rajanarsimha : కూత పెట్టిన మంత్రి రాజనర్సింహ.. కేరింతలు..! 

Damodara Rajanarsimha : కూత పెట్టిన మంత్రి రాజనర్సింహ.. కేరింతలు..! 

అందోలు, మనసాక్షి :

నిత్యం రాజకీయాల్లో బిజీబిజీగా ఉండే రాష్ట్ర వైద్యారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ కబడ్డీ కబడ్డీ అంటూ కూత బెట్టి ఆడారు. ఆందోలు గురుకులంలో పదవ జోనల్ క్రీడా పోటీల ముగింపు వేడుకలకు మంత్రి దామోదర ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

కబడ్డీ ఫైనల్ పోటీల్లో ఇస్నాపూర్ వర్సెస్ వికారాబాద్ జట్లు పోటీని మంత్రి టాస్ వేసి, క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు.అనంతరం మంత్రి మొదటి కూతగా వెళ్లి పోటీని ప్రారంభించి క్రీడాకారులలో జోష్ నింపారు. మంత్రి కబడ్డీ ఆడుతుండగా బాలికలంతా ఉత్సాహంగా కేరింతలు పెట్టారు.

తనకు క్రీడలు అంటే ఇష్టమని తాను చిన్నతనంలో క్రీడలు ఆడేవాడినన్నారు. క్రీడలతో శారీరక దారుఢ్యం, మానసిక ప్రశాంతత ఉంటుందన్నారు. మంత్రి కబడ్డీ ఆడుతున్న వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది. మంత్రి కబడ్డీ ఆట ఆడుతున్న తీరును చూసి లైకులు కొడుతూ ఇతర గ్రూపుల్లోకి షేర్ చేస్తున్నారు.

LATEST UPDATE : 

మరిన్ని వార్తలు