Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsరాజకీయంహైదరాబాద్

KTR : బిగుస్తున్న ఉచ్చు.. కేటీఆర్ అరెస్టుకు రంగం సిద్ధం..!

KTR : బిగుస్తున్న ఉచ్చు.. కేటీఆర్ అరెస్టుకు రంగం సిద్ధం..!

హైదరాబాద్, మన సాక్షి :

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఉచ్చు బిగుస్తోంది. ఆయనను అరెస్టు చేయడానికి రంగం సిద్ధమైనట్లు సమాచారం. ఓవైపు ఈ రేసింగ్, ఫోన్ టాపింగ్ లో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేటీఆర్.. ఆ కేసులలో అరెస్టు చేస్తారని ముందుగానే ఊహించారు.

ఈ విషయంపై కేటీఆర్ కూడా స్పందించి తనను అరెస్టు చేస్తే జైలుకు వెళ్తా అని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా లగచర్లలో జిల్లా కలెక్టర్ పై దాడి అంశం మరొకటి వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటనలో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని అరెస్టు చేసి చర్లపల్లి జైలుకు పంపిన విషయం తెలిసిందే.

కాగా పట్నం నరేందర్ రెడ్డి తో కేటీఆర్ పలుమార్లు ఫోన్లో సంభాషించినట్లు, లగచర్ల ఘటనకు కేటీఆర్ కూడా బాధ్యుడే అయినట్లుగా పోలీస్ విచారణలో తేలినట్లు సమాచారం. దాంతో లగచర్ల ఘటన విషయంలో కేటీఆర్ ను కూడా పోలీసులు అరెస్టు చేసేందుకు రంగం సిద్ధమైనట్లు సమాచారం.

ఈ విషయంపై బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అలర్ట్ అయ్యాయి. కేటీఆర్ ను కలిసేందుకు గురువారం తెల్లవారుజాము నుంచే భారీగా తరలివస్తున్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ తనని ఏదో ఒక కేసులో ఇరికించి అరెస్టు చేస్తారని ముందే తెలుసు అన్నారు.

రైతుల విషయంలో జైలుకు వెళ్తే సంతోషమే అని ఆయన పేర్కొన్నారు. కేటీఆర్ వ్యాఖ్యలు చూస్తే ఆయనను నిజంగానే పోలీసులు అరెస్టు చేస్తారా..? అని తెలుస్తోంది. ఏది ఏమైనా కేటీఆర్ ను అరెస్టు చేయడానికి రంగం సిద్ధమైనట్లు సమాచారం.

MOST READ : 

మరిన్ని వార్తలు