Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునల్గొండ

Miryalaguda : చేప పిల్లలు నాణ్యత లేవని కాంట్రాక్టర్ పై ఎమ్మెల్యే ఆగ్రహం..! 

Miryalaguda : చేప పిల్లలు నాణ్యత లేవని కాంట్రాక్టర్ పై ఎమ్మెల్యే ఆగ్రహం..! 

అడవిదేవులపల్లి, మన సాక్షి :

నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గంలో అడవిదేవులపల్లి మండల కేంద్రానికి సమీపంలో ఉన్న
టైల్ ఫౌండ్ రిజర్వాయర్ నందు చేప పిల్లల పంపిణీ కార్యక్రమంలో మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి పాల్గొని అనంతరం చేప పిల్లలలో నాణ్యత లేదని గ్రహించి వెంటనే చేప పిల్లలు వదలకుండా నిలిపివేయాలని ఆదేశించారు.

ఈ సందర్భంగా ఆయన మత్స్య శాఖ అధికారులతో కాంట్రాక్టర్ తో మాట్లాడుతూ చేప పిల్లలలో నాణ్యత లేదని అలాగే చిన్న పిల్లలు ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం మత్స్య కారులకు అండగా ఉండేందుకు చాప పిల్లలను విడుదల చేసే కార్యక్రమాలు నిర్వహిస్తుంటే మీరు ఇలా నాణ్యత లేని చేపలను విడుదల చేయడం వలన ఎలాంటి ప్రయోజనం లేదని అన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని అధికారులు ఇలా నిర్లక్ష్యం చేసి రైతులకు నష్టం జరిగేలా చేయకూడదని అన్నారు. తక్షణమే చేప పిల్లలు అన్నిటిని రిటన్ పంపించి నాణ్యమైన చేప పిల్లలు తెప్పించి మరో రోజు కార్యక్రమం నిర్వహించాలని అధికారులకు సూచించారు.

ఈ కార్యక్రమంలో డిసిసి అధ్యక్షుడు కేతావత్ శంకర్ నాయక్, సీనియర్ నాయకుడు స్కైలాబ్ నాయక్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పొదిల శ్రీనివాస్, మండల నాయకులు బండి నాగేశ్వరరావు, బండి నరసింహారావు, ఎస్టి సెల్ మండల అధ్యక్షుడు దశరథ్ నాయక్, నక్క వెంకటేశ్వర్లు, కుర్ర అశోక్ నాయక్,కాంగ్రెస్ నాయకులు బి ఎల్ ఆర్ బ్రదర్స్ తదితరులు పాల్గొన్నారు.

LATEST UPDATE : 

మరిన్ని వార్తలు