Miryalaguda : అభ్యాస్ స్కూల్లో ఆకట్టుకున్న బాలల వేషధారణ.. ఘనంగా బాలల దినోత్సవం..!
Miryalaguda : అభ్యాస్ స్కూల్లో ఆకట్టుకున్న బాలల వేషధారణ.. ఘనంగా బాలల దినోత్సవం..!
మిర్యాలగూడ, మన సాక్షి :
మిర్యాలగూడ లోని అభ్యాస్ ప్రైమరీ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా స్కూల్ కరస్పాండెంట్, డైరెక్టర్ వంగాల పుష్పలత నిరంజన్ రెడ్డి విద్యార్థులు ఉపాధ్యాయులతో కలిసి నెహ్రూ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించి మాట్లాడారు.
భారతదేశ తొలి ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూకు పిల్లలంటే చాలా ఇష్టం. దాంతో ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ రోజును జరుపుకుంటారు. పిల్లలే దేశ భవిష్యత్తు అని ఆయన నమ్మాడు అన్నారు.
స్వాతంత్య్ర పోరాటంలో ప్రముఖ పాత్ర పోషించడంతో పాటు, భారతదేశాన్ని పునర్నిర్మించడంలో, ప్రజాస్వామ్యాన్ని స్థాపించడంలో ఇంకా బలోపేతం చేయడంలో పండిట్ నెహ్రూ పోషించిన పాత్రను భారతదేశం ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటుందన్నారు.
అనంతరం విద్యార్థిని విద్యార్థులు నృత్య ప్రదర్శన చేశారు. చక్కటి నైపుణ్యాన్ని ప్రదర్శించిన చిన్నారులకు స్కూలు యాజమాన్యం బహుమతులతో అభినందించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ఇంచార్జ్ అనిత, ప్రిన్సిపాల్ శ్వేత, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.
MOST READ :









