Breaking Newsతెలంగాణరాజకీయం

Miryalaguda : మాజీ ఎమ్మెల్యే భాస్కరరావుకు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మిర్యాలగూడ మాజీ శాసనసభ్యులు, బీఆర్ఎస్ నాయకులు నల్లమోతు భాస్కరరావుకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

Miryalaguda : మాజీ ఎమ్మెల్యే భాస్కరరావుకు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

మిర్యాలగూడ, మన సాక్షి :

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మిర్యాలగూడ మాజీ శాసనసభ్యులు, బీఆర్ఎస్ నాయకులు నల్లమోతు భాస్కరరావుకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. బుధవారం మున్సిపల్ ఎన్నికల తొలి ప్రచార సభను మిర్యాలగూడలో నిర్వహించారు. బహిరంగ సభ వేదికపై నుంచి మాట్లాడుతూ భాస్కరరావుకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. గతంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నెత్తిన పెట్టుకొని మోసి గెలిపిస్తే కెసిఆర్ ఫామ్ హౌస్ కు తాకట్టు పెట్టాడని పేర్కొన్నారు.

తనకు ఏమి కాదని జానారెడ్డి, గుత్తా సుఖేందర్ రెడ్డి, రఘువీర్ రెడ్డి అండగా ఉంటారని ధీమా వ్యక్తం చేస్తున్నాడేమో భాస్కరరావు.. కానీ వారంతా నాకు ముందే చెప్పారు.. నక్కజిత్తుల భాస్కరరావు సంగతి చూడమన్నారని వేదికపై నుంచి వార్నింగ్ ఇచ్చారు. మిర్యాలగూడ మున్సిపాలిటీలో కాంగ్రెస్ వార్డు కౌన్సిలర్లకు బెదిరిస్తున్నట్లు తెలిసిందని, కానీ భాస్కరరావుకు ఒళ్ళు చింతపండు అవుతుందని వార్నింగ్ ఇచ్చారు. మేము జానారెడ్డి లాంటి వారిమి కాదని ఒళ్లు చింతపండు చేస్తామని చెప్పారు.

MOST READ 

  1. Gold Price : బంగారం ధరలో ఊహించని మార్పు.. ఈరోజు తులం ఎంతంటే..!

  2. Municipal Elections : మున్సిపల్ ఎన్నికల్లో అప్పుడే బోణీ.. కాంగ్రెస్ జోష్..!

  3. NLG : రైతు నుంచి రూ. 20 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన రెవెన్యూ ఇన్స్పెక్టర్..!

  4. Rythu Bharosa : రైతు భరోసా శాటిలైట్ సర్వే పూర్తి.. షాకింగ్ నిజాలు, లేటెస్ట్ అప్డేట్..!

మరిన్ని వార్తలు