Miryalaguda : ఘనంగా బిఎల్ఆర్ పుట్టినరోజు వేడుకలు.. కార్యకర్తల రక్తదానం..!

మిర్యాలగూడ శాసన సభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి జన్మదినాన్ని శనివారం నాయకులు కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు.

Miryalaguda : ఘనంగా బిఎల్ఆర్ పుట్టినరోజు వేడుకలు.. కార్యకర్తల రక్తదానం..!

మిర్యాలగూడ, మన సాక్షి :

మిర్యాలగూడ శాసన సభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి జన్మదినాన్ని శనివారం నాయకులు కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు నూకల వేణుగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. బిఎల్ఆర్ రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు.

ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు నూకల వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ ఆపద్బాంధవుడు బిఎల్ఆర్ జన్మదిన సందర్భంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసుకోవడం చాలా గర్వకారణంగా ఉందని, ఈరోజు దాదాపుగా వందమంది యువకులు రక్తదానం చేయడం జరిగిందని అన్నారు.

బిఎల్ఆర్ రాజకీయాలకు రాకముందుకే గత పది సంవత్సరాల నుండి ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడని అలాంటి వ్యక్తి మన కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి శాసనసభ్యులు కావడం మన అందరి అదృష్టమని అన్నారు. వారిని ఆదర్శంగా తీసుకొని మన కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరూ సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ ప్రజా సంక్షేమమే వారి సంక్షేమం అనే విధంగా బిఎల్ఆర్ బాటలో పయనించాలని అన్నారు.

రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థి జానా రెడ్డి తనయుడు రఘువీర్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించి యావత్ భారతదేశం మొత్తం కూడా మన నల్లగొండ నియోజకవర్గం వైపు చూసేలా రఘువీర్ గెలుపు ఉండాలని వారు కోరారు.

ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు స్కైలాబ్ నాయక్, పిసిసి సభ్యులు చిరుమర్తి కృష్ణయ్య, డిసిసి ప్రధాన కార్యదర్శి చిలుకూరి బాలు, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు ముదిరెడ్డి నర్సిరెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పొదిలి శ్రీనివాస్, అర్జున్, కౌన్సిలర్లు దేశిడి శేఖర్ రెడ్డి, గంధం రామకృష్ణ, మోయిజ్, పందిరి అనిత, చల్లా నాగమ్మ , వెంకన్న, రుణాల్ రెడ్డి, లావూరి రవి నాయక్, కోడి రెక్క ఇంద్ర కుమార్, మాజీ కౌన్సిలర్లు ఆలగడప గిరిధర్, బల్గురు శ్రీనివాస్, చెనగోని యాదగిరి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు అజార్,

అడావత్ అశోక్ నాయక్, కృష్ణ, ఎంపీటీసీల జిల్లా కార్యదర్శి బెజ్జం సాయి, ఇజ్రాయిల్, జగ్గారెడ్డి, శేఖర్ రెడ్డి, వార్డ్ ఇన్చార్జులు గోదాల జానకి రామ్ రెడ్డి, పైడిమరి గోవర్ధన చారి, శరత్, చక్రి ,మొల్లాల అమృత రెడ్డి, విష్ణు, బూడిద సైదులు, అవుట శీను, బెజ్జం నాగరాజు, అబ్దుల్లా, అంబటి వెంకటకృష్ణ, పర్వేజ్ ఖాన్, మంగ్యా నాయక్, పసుపులేటి శేఖర్, వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ALSO READ : 

WhatsApp : వాట్సాప్ లో అదిరిపోయే ఫీచర్.. ఈవెంట్ ప్లాన్ చేయొచ్చు..!

Climbing Stairs : మీరు ప్రతిరోజు మెట్లు ఎక్కి దిగుతున్నారా..? అయితే ఇది తెలుసుకోవాల్సిందే.. కొత్త అధ్యాయంలో నిజాలు..!

BREAKING : తక్కువ మార్కులు వచ్చాయని కత్తులతో పొడుచుకున్న తల్లి కూతుర్లు..!

బెల్ట్ షాపులపై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడి.. 22.475 లీటర్ల బీర్లు విస్కీ బాటిల్స్ స్వాధీనం..!

Nalgonda : గంజాయి విక్రయిస్తున్న నిందితుల అరెస్టు..!