Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణసిద్దిపేట జిల్లా

బెల్ట్ షాపులపై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడి.. 22.475 లీటర్ల బీర్లు విస్కీ బాటిల్స్ స్వాధీనం..!

బెల్ట్ షాపులపై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడి.. 22.475 లీటర్ల బీర్లు విస్కీ బాటిల్స్ స్వాధీనం..!

గజ్వేల్, మనసాక్షి :

ఎలాంటి ప్రభుత్వ అనుమతి లేకుండా కొడకండ్ల గ్రామంలో కొండ శ్రీనివాస్ తన కిరాణా షాప్ లో అక్రమంగా నడుపుచున్న బెల్ట్ షాపులపై సిద్దిపేట టాస్క్ ఫోర్స్, కుకునూరు పల్లి పోలీసులు కలసి రైడ్ చేసి 22.475 లీటర్ల బీర్లు విస్కీ బాటిల్స్ స్వాధీనం చేసుకున్నారు.

కుకునూరు పల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా టాస్క్ ఫోర్స్ పోలీస్ అధికారులు మాట్లాడుతూ ఇండ్లలో, హోటల్లలో, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో,కిరాణా షాపులలో, ఇతర దుకాణాలలో ఎలాంటి ప్రభుత్వ పర్మిషన్ లేకుండా అక్రమంగా బెల్ట్ షాప్ నడిపితే, మరియు బహిరంగ ప్రదేశంలో కానీ ఇళ్లల్లో గానీ పేకాట ఆడితే సమాచారం అందించాలని కోరారు.జూదం పేకాట ఆడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఎలాంటి ప్రభుత్వ అనుమతి లేకుండా ఇసుక,పిడిఎస్ రైస్,అక్రమ రవాణా చేసిన మరియు పేకాట, జూదం, గంజాయి ఇతర మత్తు పదార్థాలు విక్రయించిన కలిగి ఉన్న చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నట్లు సమాచారం ఉంటే వెంటనే సిద్దిపేట టాస్క్ ఫోర్స్ అధికారుల నెంబర్లు 8712667445, 8712667446, 8712667447 లకు సమాచారం అందించాలని సూచించారు. సమాచారం అందించిన వారి పేర్లు గోప్యంగా ఉంచడం జరుగుతుందన్నారు.

ALSO READ : 

Nalgonda : మా జోలికొస్తే లాగు లిప్పి కొడతామంటూ.. కోమటిరెడ్డి బ్రదర్స్ పై రెచ్చిపోయిన మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి..!

Whatsapp : వాట్సాప్ లో అదిరిపోయే ఫీచర్.. ఇక మీ ఫ్రెండ్స్ స్టేటస్ పెట్టగానే..!

Aadhaar : మీ ఆధార్ కార్డులో ఉన్న ఫోటో మీకు నచ్చలేదా..? అయితే ఇలా మార్చేయండి..!

మరిన్ని వార్తలు