Miryalaguda : ఉగాది సందర్భంగా ఇందిరమ్మ ఇళ్లు ప్రారంభం..!
ఉగాది పండుగ సందర్భంగా దామరచర్ల మండలం గణేష్ పాడు మరియు మిర్యాలగూడ మండలం సీత్యా తండా, దీరావత్ తండాలలో లబ్ధి దారుల నూతన ఇందిరమ్మ ఇళ్ళు లు శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మల్సీ శంకర్ నాయక్ రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించారు.

Miryalaguda : ఉగాది సందర్భంగా ఇందిరమ్మ ఇళ్లు ప్రారంభం..!
మిర్యాలగూడ, మన సాక్షి:
ఉగాది పండుగ సందర్భంగా దామరచర్ల మండలం గణేష్ పాడు మరియు మిర్యాలగూడ మండలం సీత్యా తండా, దీరావత్ తండాలలో లబ్ధి దారుల నూతన ఇందిరమ్మ ఇళ్ళు లు శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి,
ఎమ్మల్సీ శంకర్ నాయక్ రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా లబ్దిదారులు వారి కుటుంబ సభ్యులు ప్రజా ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం ఏర్పాటైన రెండున్నర సంవత్సరాలలో మిర్యాలగూడ నియోజకవర్గంలో 3500 ఇందిరమ్మ ఇళ్లను నిర్మించి పేద కుటుంబాల సొంత ఇంటి కలను నెరవేర్చామని అన్నారు.అతిత్వరలోనే మిర్యాలగూడ పట్టణంలో కూడా 2500 ఇళ్లకు శ్రీకారం చుట్టబోతున్నామని అన్నారు. గత ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమం పక్కకు పెట్టి కమిషన్ ల కోసం రాష్టాన్ని అప్పుల కుప్పగా చేసిందన్నారు.
ప్రజా ప్రభుత్వంలో పేద కుటుంబాలకు సన్నబియ్యం, నూతన రేషన్ కార్డులు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇళ్ళు లాంటి అనేక సంక్షేమాలను పేద ప్రజలకు అందించి వారి అందరి ఆశీస్సులతో సర్పంచ్ ఎన్నికల్లో, మున్సిపాలిటీ ఎన్నికల్లో ప్రజా ప్రభుత్వానికి నీరాజనాలు పలికి అధిక స్థానాల్లో ఆశీర్వధించారని అన్నారు.










