Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsకరీంనగర్జిల్లా వార్తలు

Karimnagar : కరీంనగర్ జిల్లా కలెక్టర్ చిత్ర మిశ్రా మాదకద్రవ్యాల పై కీలక ప్రకటన..!

మాధకద్రవ్యాల నిర్మూలన ప్రతి ఒక్కరి బాధ్యత అని, సమిష్టి కృషితో డ్రగ్స్ రహిత కరీంనగర్ గా తీర్చిదిద్దుదామని జిల్లా కలెక్టర్ చిత్ర మిశ్రా అన్నారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లాస్థాయి నార్కో కోఆర్డినేషన్ సెంటర్ కమిటీ సమావేశం మంగళవారం జరిగింది.

Karimnagar : కరీంనగర్ జిల్లా కలెక్టర్ చిత్ర మిశ్రా మాదకద్రవ్యాల పై కీలక ప్రకటన..!

కరీంనగర్, మనసాక్షి :

మాధకద్రవ్యాల నిర్మూలన ప్రతి ఒక్కరి బాధ్యత అని, సమిష్టి కృషితో డ్రగ్స్ రహిత కరీంనగర్ గా తీర్చిదిద్దుదామని జిల్లా కలెక్టర్ చిత్ర మిశ్రా అన్నారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లాస్థాయి నార్కో కోఆర్డినేషన్ సెంటర్ కమిటీ సమావేశం మంగళవారం జరిగింది.

ఈ సమావేశానికి హాజరైన కలెక్టర్ చిత్రా మిశ్రా మాట్లాడుతూ పోలీస్, ఎక్సైజ్, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖలు సమన్వయంతో మాధకద్రవ్యాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని అన్నారు. కాన్షియస్ నెస్ క్లబ్బులు చురుగ్గా పనిచేసే విధంగా చూడాలని ఆదేశించారు. జిల్లాలోని పలు సంక్షేమ శాఖ అధికారులను కూడా డ్రగ్స్ నివారణ కార్యక్రమాల్లో, సమావేశాలు భాగస్వాములను తెలిపారు. యువత, విద్యార్థులు డ్రగ్స్ బారిన పడకుండా విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న 99 రోజుల ప్రగతి ప్రణాళికలను డ్రగ్స్ నిర్మూలన ఒక ముఖ్యమైన అంశమని తెలిపారు. అందుకు తగిన రీతిలో కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం మాట్లాడుతూ జిల్లాలో పోలీసు శాఖ ఆధ్వర్యంలోని యాంటీ డ్రగ్ కమిటీలు చురుగ్గా పనిచేస్తున్నాయని తెలిపారు. వివిధ విద్యాసంస్థల్లో అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా చేపడుతున్నామని అన్నారు.

ప్రజా రవాణా ప్రాంతాల్లో ముమ్మర తనిఖీలు నిర్వహిస్తూ డ్రగ్స్ నివారణకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. నిషేధిత ఇంజక్షన్లు, టాబ్లెట్లు వినియోగించినా, సరఫరా చేసిన బాధ్యులపై క్రిమినల్ చర్యలు ఉంటాయని హెచ్చరించారు. డ్రగ్స్ సమాచారం తెలిస్తే పోలీసులకు తెలియజేయాలని అన్నారు. జిల్లాలో గత రెండు నెలల్లో డ్రగ్ సంబంధిత కేసులు 3 నమోదు కాగా ఆరుగురిని అరెస్టు చేశారు.

578 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో మహేశ్వర్, జిల్లా వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మి, జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి, జిల్లా వైద్యాధికారి వెంకటరమణ, ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాసరావు, నెంబర్లు రాజేంద్రప్రసాద్, కేశవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఎక్కువ మంది చదివిన వార్తలు

మరిన్ని వార్తలు