Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIESBreaking Newsతెలంగాణవ్యవసాయంసంక్షేమం

Rythu Bharosa : యాసంగి రైతు భరోసా వారికే.. లేటెస్ట్ అప్డేట్..!

తెలంగాణ రైతాంగం యాసంగి రైతు భరోసా నిధుల కోసం ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. అప్పుడు.. ఇప్పుడు.. అంటూ ప్రభుత్వం ఆలస్యం చేసింది. యాసంగి సీజన్ ముగిసే సమయం వచ్చింది. కానీ ఎట్టకేలకు ఈనెల 22వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు భరోసా నిధులు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.

Rythu Bharosa : యాసంగి రైతు భరోసా వారికే.. లేటెస్ట్ అప్డేట్..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

తెలంగాణ రైతాంగం యాసంగి రైతు భరోసా నిధుల కోసం ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. అప్పుడు.. ఇప్పుడు.. అంటూ ప్రభుత్వం ఆలస్యం చేసింది. యాసంగి సీజన్ ముగిసే సమయం వచ్చింది. కానీ ఎట్టకేలకు ఈనెల 22వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు భరోసా నిధులు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. మూడు విడతలుగా ఏప్రిల్ నెలాఖరు వరకు రాష్ట్రంలోని రైతులందరికీ రైతు భరోసా పథకం నిధులు వారి వారి ఖాతాలలో జమ చేయనున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా 1.50 కోట్ల ఎకరాలకు 9000 కోట్ల రూపాయలను ప్రభుత్వం రైతు భరోసా పథకం ద్వారా అందజేయనున్నది. అందుకు ముహూర్తం కూడా ఫిక్స్ అయింది. కాగా రైతులకు వారి ఖాతాలకు రైతు భరోసా నిధులు రావాలంటే ఖచ్చితంగా కేవైసీ పూర్తి చేసుకుని ఉండాల్సి ఉంది.

అంతే కాకుండా ప్రధానంగా రైతులకు భూ భారతి ఆధారంగా రైతు భరోసా పథకాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. భూ భారతి రికార్డుల్లో ఉన్న భూమి వివరాల ఆధారంగానే రైతులకు రైతు భరోసా పథకాన్ని అందజేయన్నారు. భూభారతిలో నమోదు కాని రైతులకు రైతు భరోసా పథకం అందే అవకాశాలు లేవు.

మొదట్లో శాటిలైట్ సర్వే ఆధారంగా యాసంగి లో పంటలు సాగు చేసిన రైతులకు మాత్రమే రైతు భరోసా పథకం అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించినప్పటికీ అది సాధ్యం కాలేదు. దాంతో భూభారతి రికార్డుల ప్రకారం రైతు భరోసా అందజేసేందుకు ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం.

ఇవీ చదవండి

మరిన్ని వార్తలు