Breaking Newsజిల్లా వార్తలునల్గొండవిద్య

Miryalaguda : సెయింట్ జాన్స్ హై స్కూల్లో ఘనంగా స్వపరిపాలన దినోత్సవం..!

మిర్యాలగూడలోని సెయింట్ జాన్స్ హై స్కూల్లో బుధవారం స్వపరిపాలన దినోత్సవం ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు ఉపాధ్యాయులుగా వివిధ హోదాలలో పాత్రలు పోషించారు.

Miryalaguda : సెయింట్ జాన్స్ హై స్కూల్లో ఘనంగా స్వపరిపాలన దినోత్సవం..!

మిర్యాలగూడ, మన సాక్షి :

మిర్యాలగూడలోని సెయింట్ జాన్స్ హై స్కూల్లో బుధవారం స్వపరిపాలన దినోత్సవం ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు ఉపాధ్యాయులుగా వివిధ హోదాలలో పాత్రలు పోషించారు. విద్యాశాఖ మంత్రిగా వర్షిత, ఆర్జెడిగా సర్వేశ్వర్, కలెక్టర్ గా స్నేహ, ముఖ్యమంత్రిగా అక్షిత్ రాజ్, ఎమ్మెల్యేగా రామ్ సుధీర్, గవర్నర్ గా లిఖిత్, ఫైనాన్స్ మినిస్టర్ గా సాయి, డీఈఓ గా శ్రీహర్ష, ఎంఈఓ గా కీర్తన, కరస్పాండెంట్ గా లావణ్య, ప్రిన్సిపాల్ గా మహీధర్, డైరెక్టర్ గా మనోజ్, మొత్తం 121 మంది విద్యార్థులు ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులుగా పాల్గొన్నారు.

ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పాఠశాల ప్రిన్సిపల్ అలుగుబెల్లి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ మా పాఠశాలలో విద్యతోపాటు విద్యార్థుల సృజనాత్మకతను వెలికి తీసే ఇలాంటి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ అనేక టాలెంట్ టెస్ట్ లను నిర్వహిస్తూ రానున్న తరాలకు అనుగుణంగా విద్యను అందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ అలుగుబెల్లి శిరీష తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు