Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండవిద్య

ఎన్ఎంఎంఎస్ ఫలితాలలో చింతపల్లి మోడల్ స్కూల్ విద్యార్థులు ఎంపిక..!

చింతపల్లి మండల కేంద్రంలోని స్థానిక తెలంగాణ ఆదర్శ పాఠశాల ఎనిమిదవ తరగతి చదువుతున్న ఇరువురు విద్యార్థులు జాతీయ ఆదాయ ప్రతిభ ఆధారిత విద్యావేతన పథకం కింద ఎంపికైనట్లు ఆ పాఠశాల ప్రిన్సిపాల్ అంతుల్ జమాల్ అస్రా, ఇన్చార్జి ప్రిన్సిపాల్ వెంకట్ రెడ్డిలు గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

ఎన్ఎంఎంఎస్ ఫలితాలలో చింతపల్లి మోడల్ స్కూల్ విద్యార్థులు ఎంపిక..!

చింతపల్లి, మనసాక్షి :

చింతపల్లి మండల కేంద్రంలోని స్థానిక తెలంగాణ ఆదర్శ పాఠశాల ఎనిమిదవ తరగతి చదువుతున్న ఇరువురు విద్యార్థులు జాతీయ ఆదాయ ప్రతిభ ఆధారిత విద్యావేతన పథకం కింద ఎంపికైనట్లు ఆ పాఠశాల ప్రిన్సిపాల్ అంతుల్ జమాల్ అస్రా, ఇన్చార్జి ప్రిన్సిపాల్ వెంకట్ రెడ్డిలు గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

ఈ సందర్భంగా వారు విలేకరులతో మాట్లాడుతూ మాట్లాడుతూ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న గోపర్ల దివ్య రాయినిగూడెం గ్రామానికి చెందిన విద్యార్థినీ, అదేవిధంగా చింతపల్లి మండల కేంద్రంలోని 8వ తరగతి చదువుతున్న తేజశ్రీ హోటల్ రాము కుమార్తె కు ఈ స్కాలర్షిప్ ఫలితాలలో విజయం సాధించడం ఎంతో హర్షించదగ్గ విషయమై వారి పేర్కొన్నారు. నిరుపేద కుటుంబాలకు చెందిన విద్యార్థులు కేంద్ర ప్రభుత్వం కల్పించే ఈ అవకాశాన్ని దక్కించుకోవడం ఎంతో సంతోషించదగ్గ విషయం అన్నారు.

అవకాశం దక్కడం ఎంతో హర్షించదగ్గ విషయం అన్నారు.నిరుపేద విద్యార్థుల వైట్ చదవడం కోసం కేంద్ర ప్రభుత్వం సంవత్సరానికి 12 వేల రూపాయలు చొప్పున ఈ స్కాలర్షిప్ లు అందజేస్తుందన్నారు. గ్రామీణ నిధి పేదల కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టే ఇలాంటి అవకాశాలను నిరుపేద విద్యార్థులు సద్వినియోపరుచుకోవాలి అన్నారు.

ఈ సందర్భంగా చింతపల్లి మండలం కేంద్రంలోని మన మోడల్ పాఠశాల నుండి ఈరోజు ఇరువురు విద్యార్థులు జాతీయ స్కాలర్షిప్ కు ఎంపిక కావడం మన మోడల్ పాఠశాల కి గర్వకారణం అన్నారు. మునుముందు మరి ఎంతో మంది విద్యార్థులు మన పాఠశాల నుండి జాతీయ స్కాలర్షిప్ కు అర్హులను చేసే విధంగా ఉపాధ్యాయ సిబ్బంది కృషి చేయాలని మోడల్ పాఠశాల ప్రిన్సిపాల్ అంతుల్ జమాల్ ఆశ్ర పేర్కొన్నారు.

విద్యార్థులు జాతీయ స్కాలర్షిప్ ఎంపిక కావడం పట్ల మాకెంతో గర్వకారణం ఉందన్నారు. మునుముందు ఇలాంటి స్కాలర్షిప్లు మరెన్నో పొందేందుకు విద్యార్థులకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామన్నారు. ఈ స్కాలర్షిప్లు పొందిన విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు మోడల్ పాఠశాల అధ్యాపక బృందం ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ జాతీయ స్కాలర్షిప్ సాధించిన విద్యార్థులు వారు అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు