Nalgonda : ఏఐటీయూసీ జిల్లా మహాసభల ఏర్పాట్లు పూర్తి..!
గుర్రంపోడు మండల కేంద్రంలో ఆదివారం జరగనున్న ఏఐటీయూసీ నల్లగొండ జిల్లా 11వ మహాసభలకు సర్వం సిద్ధమైంది. ఈ మహాసభల ఏర్పాట్లను ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి శనివారం స్వయంగా పర్యవేక్షించారు.

Nalgonda : ఏఐటీయూసీ జిల్లా మహాసభల ఏర్పాట్లు పూర్తి..!
గుర్రంపోడు, మన సాక్షి :
నల్గొండ జిల్లా గుర్రంపోడు మండల కేంద్రంలో ఆదివారం జరగనున్న ఏఐటీయూసీ నల్లగొండ జిల్లా 11వ మహాసభలకు సర్వం సిద్ధమైంది. ఈ మహాసభల ఏర్పాట్లను ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి శనివారం స్వయంగా పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మండల కేంద్రమంతటా ఎర్రజెండాలు, తోరణాలు, భారీ బ్యానర్లతో అలంకరించడంతో గుర్రంపోడు పురవీధులన్నీ ఎరుపురంగుతో ముస్తాబయ్యాయి.
ఈ మహాసభకు జిల్లా నలుమూలల నుండి పెద్ద సంఖ్యలో కార్మిక ప్రతినిధులు తరలిరానున్నారు.ఈ సందర్భంగా పల్లా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ, జిల్లాలోని కార్మికులు ఎదుర్కొంటున్న వివిధ సమస్య లపై ఈ మహాసభల్లో సుదీర్ఘంగా చర్చించి, భవిష్యత్ పోరాట కార్యాచరణను రూపొందించనున్నట్లు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లు కార్మికులను కట్టుబానిసలుగా మార్చే విధంగా ఉన్నాయని ఆయన తీవ్రంగా ఆరోపించారు. కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న పాలకులపై పోరాటాలను తీవ్రతరం చేయాల్సిన సమయం ఆసన్నమైందని కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు.
ఆదివారం జరిగే ఈ ప్రతిష్టాత్మక మహాసభకు ముఖ్యఅతిథులుగా ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు ఎండి యూసుఫ్, డిప్యూటీ ప్రధాన కార్యదర్శి ఎం. నరసింహ, సీనియర్ నాయకులు ఉజ్జిని రత్నాకర్ రావు తదితరులు హాజరుకానున్నారు.
ఈ ఏర్పాట్ల కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు ఎన్. రామస్వామి, మండల గౌరవ అధ్యక్షులు రేపాక లక్ష్మీపతి, మండల అధ్యక్షులు ఎస్కే అమీర్, కార్యదర్శి జాల పేద నరసింహ, ఉపాధ్యక్షులు చిన నరసింహ, పి. లింగయ్య, ఏ. మల్లయ్య, ఖలీల్, శ్రీను, జానీ, ఈదయ్య, షఫీ, లక్ష్మయ్య, మహమ్మద్, ఎస్కే ఖాసీం, లాలయ్య తదితర ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.









