ప్రత్యామ్నాయ పంటల సాగుకు రైతులు ఆసక్తి చూపాలి..!
ప్రస్తుత వాతావరణ పరిస్థితులలో నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకొని రైతులు ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని వ్యవసాయ విస్తరణ (ఏఈఓ) అధికారి మాలోతు ప్రియాంక తెలిపారు.

ప్రత్యామ్నాయ పంటల సాగుకు రైతులు ఆసక్తి చూపాలి..!
వేములపల్లి,మన సాక్షి:
ప్రస్తుత వాతావరణ పరిస్థితులలో నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకొని రైతులు ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని వ్యవసాయ విస్తరణ (ఏఈఓ) అధికారి మాలోతు ప్రియాంక తెలిపారు. శనివారం మండలంలోని రావులపెంట గ్రామంలోని రైతులకు ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..ఎల్ నినో ప్రభావం వల్ల వ్యవసాయ సాగులో తీసుకోవలసిన జాగ్రత్తల పై రైతులకు వివరించారు.
భూగర్భ జలాలు తగ్గుముఖం పట్టాయని,అందువల్ల రైతులు నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకొని వరి నాట్లు వేయవలసినదిగా తెలిపారు.నీటి వసతి తక్కువగా ఉన్నవారు వరికి ప్రత్యామ్నాయంగా తక్కువ నీటితో సాగు చేయగల పంటలైన కంది,జొన్న,పెసలు, మినుములు పంటలను ప్రత్యామ్నాయ పంటలుగా సాగు చేయాలని సూచించారు.
రైతులందరూ ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని వరి సాగును కొంత మేర తగ్గించి, ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపాలని అన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సందరబోయిన చంద్రయ్య, మాజీ ఉప సర్పంచ్ తరి సైదులు,వార్డు మెంబర్ పురాణపు సైదులు,నాయకులు జిన్నా శేఖర్ రెడ్డి, రైతులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.









