Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsకరీంనగర్జిల్లా వార్తలు

రేకుర్తి భూములపై విచారణ..!

కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని రేకుర్తి 164 సర్వే నెంబర్ లోని ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుని అక్రమ నిర్మాణాలు చేపడుతున్న వారిపై రెవిన్యూ అధికారులు కొరడా జూలిపించారు.

రేకుర్తి భూములపై విచారణ..!

కరీంనగర్, మనసాక్షి :

కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని రేకుర్తి 164 సర్వే నెంబర్ లోని ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుని అక్రమ నిర్మాణాలు చేపడుతున్న వారిపై రెవిన్యూ అధికారులు కొరడా జూలిపించారు. శుక్రవారం రెవిన్యూ అధికారులు మోకా మీదకు వెళ్లి అక్రమ నిర్మాణాలను నిలిపివేయాలని నిర్వాహకులకు హెచ్చరించారు.

భూమికి సంబందించిన డాక్యుమెంట్స్ ఉంటే తహసీల్దార్ కార్యాలయానికి తీసుకుని రావాలని సూచించారు. అయితే 164 సర్వే నెంబర్ లో ఇందిరమ్మ ఇళ్లకు సంబందించిన మిగులు ప్రభుత్వ భూమిలో కొందరు వ్యక్తులు కబ్జా చేసి యాదేచ్చగా ఇంటి నిర్మాణాలు చేస్తున్నారని ఇటీవలే సింహాద్రి కాలనీ వాసులు అధికారులకు ఫిర్యాదు చేశారు. స్పందించిన ఆర్డీఓ మహేష్ కుమార్ గౌడ్ రెవిన్యూ అధికారులతో విచారణ చేపట్టారు.

ఈ అక్రమ నిర్మాణాలపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి 164 సర్వే నెంబర్ లో ప్రభుత్వ భూమిని ఆక్రమించినట్లు తెలితే ఆ నిర్మాణాలను కూల్చివేసి నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వ భూమిని ఎవరైనా కబ్జా చేసి నిర్మాణాలు చేపడితే ఎంతటి వారినైనా సహించేది లేదని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 164 సర్వే నెంబర్ ని సర్వే చేసి హద్దులు నిర్ణయించి, ప్రభుత్వ భూమిని కాపాడాలని స్థానికులు అధికారులను కోరారు.

MOST READ 

మరిన్ని వార్తలు