Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలునల్గొండ

Miryalaguda : ప్రజల సంక్షేమం, ప్రాంత అభివృద్ధి కోసం ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఎంతో కీలకం..!

శ్రీ శ్రీ శ్రీ త్రిదండి శ్రీ రామచంద్ర రామానుజ జీయర్ స్వామి వారి సంకల్పంతో, వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో ఏన్ ఎస్ పి క్యాంప్‌లో ఘనంగా నిర్వహించిన శ్రీ మహాలక్ష్మి యాగం కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రావు ఆదివారై హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Miryalaguda : ప్రజల సంక్షేమం, ప్రాంత అభివృద్ధి కోసం ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఎంతో కీలకం..!

మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు

మిర్యాలగూడ, మన సాక్షి:

శ్రీ శ్రీ శ్రీ త్రిదండి శ్రీ రామచంద్ర రామానుజ జీయర్ స్వామి వారి సంకల్పంతో, వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో ఏన్ ఎస్ పి క్యాంప్‌లో ఘనంగా నిర్వహించిన శ్రీ మహాలక్ష్మి యాగం కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రావు ఆదివారై హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రజల ఆధ్యాత్మిక చైతన్యం పెరిగినప్పుడే సమాజంలో సుస్థిర అభివృద్ధి సాధ్యం అవుతుందని తెలిపారు.

మిర్యాలగూడ నియోజకవర్గ అభివృద్ధి, ప్రజల సంక్షేమం తన లక్ష్యమని, ఎల్లప్పుడూ ప్రజల మధ్య ఉండి వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని స్పష్టం చేశారు. ఇలాంటి యాగాలు రాష్ట్రానికి శాంతి, సమృద్ధి తీసుకురావాలని కోరుకుంటూ, నిర్వాహకులను ఆయన అభినందించారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. కార్యక్రమములో యాగ మహోత్సవ కమిటి చైర్మన్ బండారు కుశలయ్య, కర్నాటి రమేష్, గౌరు శ్రీనివాస్, ఆయిల్ శ్రీనివాస్, రేపాల పురుషోత్తం రెడ్డి తదితరులు ఉన్నారు.

MOST READ 

మరిన్ని వార్తలు