Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIESBreaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

TEACHER : శ్రీరాముడు వేషధారణలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు.. ఆకట్టుకున్న వినూత్న ప్రచారం..!

సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం గోరంట్ల ప్రభుత్వ పాఠశాలకు చెందిన తెలుగు ఉపాధ్యాయుడు సామాజిక కార్యకర్త రాచకొండ ప్రభాకర్ శ్రీరామనవమి పండుగ పురస్కరించుకొని శ్రీరాముడి వేషధారణలో వినూత్నంగా నిర్వహించిన ప్రచారం అందరిని ఆకట్టుకుంది. 

TEACHER : శ్రీరాముడు వేషధారణలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు.. ఆకట్టుకున్న వినూత్న ప్రచారం..!

నల్లగొండ, మన సాక్షి :

సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం గోరంట్ల ప్రభుత్వ పాఠశాలకు చెందిన తెలుగు ఉపాధ్యాయుడు సామాజిక కార్యకర్త రాచకొండ ప్రభాకర్ శ్రీరామనవమి పండుగ పురస్కరించుకొని శ్రీరాముడి వేషధారణలో వినూత్నంగా నిర్వహించిన ప్రచారం అందరిని ఆకట్టుకుంది.

నల్లగొండ జిల్లా కేంద్రంలోని రామగిరి పరిసర ప్రాంతాలలో రామగిరి రామాలయంలో డ్రగ్స్ గంజాయి సేవించడం వల్ల కలిగే నష్టాలు రోడ్డు భద్రత పై శ్రీరాముడు వేషధారణలో అవగాహన కల్పించారు. .శ్రీరాముడు విశ్వజనీనమైన ధర్మాలను తాను ఆచరించి లోకానికి ఆదర్శంగా నిలిచాడు. అలాంటి శ్రీరాముని ఈనాటి యువత ఆదర్శంగా తీసుకొని డ్రగ్స్ గంజాయి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని కోరారు.

మత్తు పదార్థాలు మాదకద్రవ్యాలు తీసుకోవడం వల్ల తల నుండి పాదాల వరకు ఎన్నో శారీరకపరమైన నష్టాలు ఆర్థికపరమైన మానసికపరమైన నష్టాలు ఉంటాయని, కాబట్టి ఇలాంటి వాటికి దూరంగా ఉండాలని సూచించారు. అలానే రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని అతివేగం పనికిరాదని కారు నడిపే వారు విధిగా సీట్ బెల్ట్ పెట్టుకోవాలని,రోడ్డు భద్రతా నియమాలు శ్రీరామరక్షాన్ని తెలిపారు.

మరిన్ని వార్తలు