Miryalaguda : అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్ల పట్టివేత.. కేసు నమోదు..!
నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలంలోని తడకమళ్ళ గ్రామ శివారులోని మూసి వాగులో నుండి అక్రమంగా ఇసుక తరలిస్తుండగా రూరల్ పోలీసులు పట్టుకొని ఇసుక ట్రాక్టర్లను సీజ్ చేశారు.

Miryalaguda : అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్ల పట్టివేత.. కేసు నమోదు..!
మిర్యాలగూడ, మన సాక్షి :
నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలంలోని తడకమళ్ళ గ్రామ శివారులోని మూసి వాగులో నుండి అక్రమంగా ఇసుక తరలిస్తుండగా రూరల్ పోలీసులు పట్టుకొని ఇసుక ట్రాక్టర్లను సీజ్ చేశారు. రూరల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అక్రమంగా ఇసుక తరలిస్తున్నారని సమాచారం మేరకు పెట్రోలింగ్ సిబ్బంది తడకమళ్ళ గ్రామ శివారుకు వెళ్లేసరికి రెండు ట్రాక్టర్లు ఇసుక నింపుకొని తడకమళ్ళ గ్రామం వైపు నుండి కోడెబండ తండా వైపుకు వెళ్తున్నాయి. అట్టి ట్రాక్టర్లను ఆపి ట్రాక్టర్ డ్రైవర్లు యొక్క వివరాలు అట్టి ట్రాక్టర్ల నెంబర్లను పరిశీలించారు.
తడకమళ్ళకు చెందిన సిలువేరు ఆదినారాయణ ( ట్రాక్టర్ నెంబరు TS 05 UC 5148 & TS 05 UC 5147) కాగా మరో ట్రాక్టర్ డ్రైవర్ అల్వాల నాగరాజు, ఓనర్ పేరు చెన్నగాని వెంకటేశ్వర్లు ( ట్రాక్టర్ నెంబరు TG 05 E 2550, నెంబర్ లేని ట్రాలీ గా కలవు. అట్టి ట్రాక్టర్లను పట్టుబడి చేసి పోలీస్ స్టేషన్ కు తీసుకొని వచ్చి ట్రాక్టర్ డ్రైవర్ల పైన మరియు ఓనర్ల పైన కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించడమైనదని తెలిపారు.









